ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూచనలు


అమరావతి: కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రజలకు ప్రభుత్వం పలు

సూచనలు చేసింది. రైతు బజార్‌, కిరాణా షాపులు, మాంసం దుకాణాల సమయాన్ని కుదించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. పాల దుకాణాలు మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటాయి. మెడికల్‌ షాపులు 24 గంటలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.



షాపుల ముందు మీటర్‌ దూరంలో మార్కింగ్‌ చేయాలని ప్రభుత్వం సూచించింది. మార్కింగ్‌ చేయకపోతే షాపులకు అనుమతి ఉండదని హెచ్చరించింది. ఎవరూ ప్రార్థనల కోసం ఆలయాలకు వెళ్లొద్దంది. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి ఒకరికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. అనవసరంగా బయటికి వస్తే వాహనాలు సీజ్‌ చేస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ ప్రజలకు ప్రభుత్వం సూచనలు"

Post a Comment