ఏపీలో పెట్రో ధరల పెంపు

అమరావతి: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌లో సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లీటరు పెట్రోల్‌పై  ఇప్పటి వరకు 31 శాతం వ్యాట్‌తోపాటు అదనంగా 2 రూపాయలు వసూలు చేసేవారు. ఇకపై  వ్యాట్‌+రూ.2.76 వసూలు చేయనున్నారు. అంటే పెట్రోల్‌ ధరలో పెరుగుదల 76 పైసలు. అదేవిధంగా డీజిల్‌పై 22.25 వ్యాట్‌+రూ.2 గా 




ఉన్నదాన్ని 22.25+3.07గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంటే డీజిల్ రూ.1.07 మేర పెరగనుంది.ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పెరుగుదల మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీలో పెట్రో ధరల పెంపు"

Post a Comment