రావులపాలెం ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం
రావులపాలెం:
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు
ఉపాధ్యాయుడిగా పని చేసిన చోడే వెంకటేశ్వరప్రకాశానికి అరుదైన గౌరవం
దక్కింది. గత 19 ఏళ్లుగా అదే పాఠశాలలో అయన తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేసి
ఇవాళ పదవీవిరమణ పొందారు. దీంతో విద్యార్థులు ఆయన్ను విద్యార్థులు పల్లకిలో
కూర్చోబెట్టి భుజాలపై మోసుకుంటూ గ్రామమంతా
ఊరేగించారు. అనంతరం పాఠశాల
ప్రాంగణంలో జరిగిన సత్కారసభలో పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని
ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రకాశం మాట్లాడుతూ ఇంత అరుదైన గౌరవం
దక్కడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. గతంలో ఆయన ఎందరో పేద
విద్యార్థులకు అర్థికంగా సహాయపడ్డారు
0 Response to "రావులపాలెం ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం"
Post a Comment