ఎల్‌ఐసీ నుంచి కొత్త యులిప్‌లు
ఈనాడు, హైదరాబాద్: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) నుంచి రెండు యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్) తీసుకొస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ ఎం.ఆర్.కుమార్ ప్రకటించారు. ఇందులో ఒకటి ఏక ప్రీమియం పాలసీ నివేశ్ ప్లస్. ఈ పాలసీలో కనీస ప్రీమియం రూ.లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. చెల్లించిన ప్రీమియానికి 1.25 రెట్లు లేదా 10 రెట్ల వరకు బీమా రక్షణ ఎంచుకోవచ్చు. మరో పాలసీ ‘సీప్’. ఇది బీమా, పెట్టుబడికి ఉపయోగపడే పాలసీ. దీనికి కనీస ప్రీమియం ఏడాదికి రూ.40,000. ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. 55 ఏళ్లలోపు వారికి చెల్లించిన వార్షిక ప్రీమియానికి 10 రెట్లు,
అంతకుమించి వయసున్న వారికి 7 రెట్ల వరకూ బీమా రక్షణ లభిస్తుంది. ఈ రెండు పాలసీల వ్యవధి ముగిసిన తర్వాత అప్పటి వరకూ ఉన్న ఫండ్ విలువను చెల్లిస్తారు. పాలసీ తీసుకున్న ఐదేళ్ల తర్వాత కొన్ని నిబంధనలకు లోబడి పాక్షికంగా కొంత వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు. ఈ రెండు పాలసీలనూ ఆన్‌లైన్‌లోనూ, ఏజెంట్ల ద్వారా తీసుకునే అవకాశం ఉంది. మార్చి 2 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి
0 Response to "ఎల్‌ఐసీ నుంచి కొత్త యులిప్‌లు"
Post a Comment