ప్రతి డిపో నుంచి 5 ఆర్టీసి బస్సులు అత్యవసర సేవలకు అందుబాటులో


ప్రతి డిపో నుంచి 5 ఆర్టీసి బస్సులు
   అత్యవసర సేవలకు అందుబాటులో
* కూరగాయల తరలింపునకు, ఏర్పాట్లు ఈనాడు, అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర సేవలు అందించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రతి డిపో నుంచి 5 బస్సులు చొప్పున అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో 12) డిపోలు ఉండగా, అన్నిచోట్లా ఈ బస్సులను, వాటికి అవసరమయ్యే సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఆ డిపో పరి ధిలో వాటిని పంపిస్తున్నారు. ఈ బస్సుల్లో కూడా సామాజిక దూరంలో భాగంగా [-25 మందికి మించి 


అనుమతించకూడదని నిర్ణయించారు. జ బుధవారం రాత్రి ఏషీ తెలంగాణ సరిహద్దులోని కృష్ణా జిల్లా జగ్గయ్య 'పేట మండలం గరికపాడు వద్ద హైదరాబాద్‌ నుంచి వచ్చిన విద్యా ర్థులతో గందరగోళం నెలకొనగా, వారిని తరలించేందుకు బస్సులు పంపాలని ఆదేశాలు అందాయి. దీంతో కృష్ణా జిల్లాలోని వివిధ డిపోల నుంచి 40 బస్సులను రాత్రివేళ సరిహద్దుకు పంపారు. క్వారంటైన్‌కు వెళ్తామని అంగీకరించిన 




వారిని బస్సుల్లో తీసుకెళ్లి వదిలారు. జ రైతులు పండించిన పంటలు వివిధ సంతలు, మార్కెట్లకు తీసుకె శ్లేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులు నడుపుతుంటుంది. ప్రస్తుతం ఆయా జిల్లాల నుంచి వస్తున్న విజ్ఞప్పలతో రైతుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం, పశ్చిమగో దావరి, చిత్తూరు జిల్లాల్లో 10 బస్సులు ఇలా వీటికి కేటాయించారు. జ కడప జిల్లా పులివెందుల, గుంటూరు జిల్లా పొన్నూరు బస్టాండ్ల ప్రాంగణాల్లో తాత్కాలిక రైతు బజార్ల నిర్వహణకు ప్రతిపాదనలు రావడంతో అధికారులు అనుమతించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రతి డిపో నుంచి 5 ఆర్టీసి బస్సులు అత్యవసర సేవలకు అందుబాటులో"

Post a Comment