ధరల సూచీ లెక్కింపులో మార్పులు
పెరగనున్న డీఏ
ఈనాడు, దిల్లీ: పారిశ్రామిక కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) పెరగనుంది. పారిశ్రామిక కార్మికులకు సంబంధించిన ‘వినియోగదారుల ధరల సూచీ’ లెక్కింపునకు పరిగణనలోకి తీసుకొనే ఆధార సంవత్సరాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. ఇంతవరకు 2001ని ఆధార సంవత్సరం
పరిగణిస్తుండగా, ఇకపై 2016ను ఆధార సంవత్సరంగా తీసుకోనున్నారు. ఆధార సంవత్సరాన్ని ప్రతి ఐదేళ్లకు ఒకసారి మార్చాల్సి ఉన్నా, దాదాపు రెండు దశాబ్దాల అనంతరం ఈ సవరణ జరగనుండడం గమనార్హం. వినియోగదారుల ధరల సూచీ లెక్కింపునకు ఏయే అంశాలను పరిగణనలోకి
తీసుకోవాలన్నదాంట్లోనూ మార్పులు చేయనున్నారు. గతంలో ఆహారం, పానీయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ధరల సూచీని లెక్కించే వారు. ఇంతవరకు ఈ రెండు అంశాలకు 46 శాతం వెయిటేజీ ఇవ్వగా, ఇప్పుడు 39 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఆరోగ్యం, విద్య, రవాణా, వినోదం, సమాచారం వంటి అంశాలకు గతంలో 23 శాతం వెయిటేజీ ఉండగా, దానిని 30 శాతానికి పెంచనున్నారు
0 Response to "ధరల సూచీ లెక్కింపులో మార్పులు"
Post a Comment