అమ్మఒడి రూ.వెయ్యి బ్యాంకులో జమ చేయండి

చిత్తూరు(విద్య), న్యూస్‌టుడే: అమ్మఒడి కింద తల్లి బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.15వేలలో.. విరాళంగా రూ.1000ను డీఈవో, ఎస్‌ఎస్‌ అదనపు సమన్వయకర్త పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఏపీసీ వెంకటరమణారెడ్డి సోమవారం తెలిపారు. బ్యాంకు ఖాతా పేరు డీఈవో అండ్‌ ఏపీసీ అమ్మఒడి శానిటేషన్, బ్యాంకు ఖాతా నెం 0852101038827, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ సీఎన్‌ఆర్‌బీ0000852, కెనరాబ్యాంకు, చిత్తూరు ఖాతాలో జమ చేయాలని చెప్పారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో నోటీసుబోర్డులో బ్యాంకు ఖాతా వివరాలను తప్పర ప్రదర్శించాలన్నారు. ఈ విరాళం ద్వారా వచ్చిన నగదును పాఠశాల పరిశుభ్రతకు వినియోగించనున్నామని ఆయన పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అమ్మఒడి రూ.వెయ్యి బ్యాంకులో జమ చేయండి"

Post a Comment