పింఛన్ ముందే తీసుకున్న వారికి తీపి కబురు
15 ఏళ్ల తరవాత పూర్తి పింఛన్
దిల్లీ: ఉద్యోగ విరమణ సమయంలో పింఛన్ నిధి నుంచి కొంత సొమ్మును(కమ్యూటేషన్) డ్రా చేసుకున్న ఉద్యోగులకు 15 ఏళ్ల తరవాత పింఛన్ మొత్తాన్ని పూర్తిగా ఇచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ ఫిబ్రవరి 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది.
పింఛన్ పథకం నుంచి కొంత సొమ్మును డ్రా చేసుకొని 2008 సెప్టెంబర్ 25వ తేదీ కంటే ముందు ఉద్యోగ విరమణ చేసిన వారందరికీ ఈ నిర్ణయం వల్ల మేలు కలుగుతుంది. సుమారు 6.3లక్షల మంది పింఛన్‌దారులకు ప్రయోజనం చేకూరుతుందని కార్మిక శాఖ ప్రకటించింది. ఉద్యోగ విరమణ సమయంలో పింఛన్ నిధి నుంచి కొంత సొమ్మును ఏక మొత్తంలో ఉద్యోగి తీసుకుంటే ఆ మొత్తాన్ని తిరిగి
రాబట్టేందుకు పింఛన్‌లో కొంత మొత్తం 15ఏళ్ల పాటు తగ్గించి చెల్లించేవారు. ఆ తరవాత వచ్చిన నిబంధనల్లో ఉద్యోగులు ఇలా కొంత మొత్తాన్ని ముందుగా తీసుకునే సదుపాయాన్ని లేకుండా చేశారు
0 Response to " పింఛన్ ముందే తీసుకున్న వారికి తీపి కబురు"
Post a Comment