గూగుల్‌ మ్యాప్స్‌ ఎలా చెబుతోందంటే..?

ఫలానా ఏరియా మనకెంత దూరం.. గూగుల్‌ మ్యాప్స్‌ ఉందిగా!
మన ఏరియాలో ట్రాఫిక్‌ ఎలా ఉంది.. గూగుల్‌ మ్యాప్స్‌ ఉందిగా!
ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి. ఎంత టైమ్‌ పడుతుంది.. గూగుల్‌ మ్యాప్స్‌ ఉందిగా!
ఈ  ప్రశ్నలే కాదు ఇలాంటి చాలా ప్రశ్నలకు గూగుల్‌ మ్యాప్స్‌ అనే సమాధానం వస్తుంది. అయితే మరి గూగుల్‌ ఈ పనులన్నీ ఎలా చేస్తుంది? మీకూ ఇలాంటి ప్రశ్నే ఉందా? అయితే ఈ వార్త మీకోసమే!



ట్రాఫిక్‌ అంచనా, బస్‌ సమయాల వివరాలు తెలుసుకునేలా గూగుల్‌ కొన్ని నెలల క్రితం ఆప్షన్‌ తీసుకొచ్చింది. కచ్చితమైన సమాచారం ఇవ్వడానికి గూగుల్‌ గత కొన్నేళ్లుగా సమాచారం సేకరిస్తూ వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి బస్సుల సమయాల్ని పరిశీలించింది. ఆయా బస్సు సర్వీసుల రియల్‌ టైమ్‌ ఫీడ్స్‌ ఆధారంగా చేసుకొని ఈ ప్రక్రియ నిర్వహించింది. ఆ తర్వాత ఈ సమాచారాన్ని ఆ బస్సుల రూట్‌లోని కార్‌ ట్రాఫిక్‌ స్పీడ్‌తో ఇంటిగ్రేట్‌ చేసుకుంది. ఈ సమాచారంలో బస్సు రూట్‌, ట్రిప్‌ లొకేషన్‌, టైమింగ్‌, తిరిగిన వీధులు, స్టాప్‌లు లాంటివి ఉన్నాయి. ఇలా సేకరించిన ట్రిప్‌ సమాచారాన్ని యూనిట్లగా విభజించారు. వాతావరణం ఆధారంగా ఈ యూనిట్లను విభజించారు. అలా సిద్ధం చేసిన సమాచారాన్ని యూజర్ల అవసరానికి తగ్గట్టుగా అందిస్తున్నారు. ఇదంతా మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారంగా సాగుతుంది

ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ట్రాఫిక్ ఉంటుంది. దీనిని కూడా గూగుల్‌ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వివరాలు అందిస్తోంది. అందుకే అంత కచ్చితంగా ఉంటూ వస్తోంది. దీని కోసం గూగుల్‌ ఆయా ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వివరాల్ని సేకరించింది. దీంతోపాటు ఏయే ప్రాంతంలో ఎప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుందనే సమాచారమూ తీసుకుంది. ఇలా రోజులో నిర్ణీత సమయాల్లో డేటాను సేకరించింది.  దీని కోసం గూగుల్‌ 4 డైమన్షనల్‌ లూప్‌ విధానాన్ని అవలంభించింది. ఇలా వచ్చిన మొత్తం సమాచారాన్ని ఒక్కటిగా చేసి యూజర్లకు గూగుల్‌ మ్యాప్స్‌లో అవసరమైన సమయంలో వివరాల్ని అందిస్తోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గూగుల్‌ మ్యాప్స్‌ ఎలా చెబుతోందంటే..?"

Post a Comment