సాక్షి మాక్‌ టెస్టులు


జేఈఈ మెయిన్, నీట్, ఎంసెట్‌ విద్యార్థులకు..

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు



సాక్షి, హైదరాబాద్‌:
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం ఇంజనీరింగ్‌ లేదా మెడిసిన్‌.. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ప్రముఖ ఇంజనీరింగ్‌/మెడికల్‌ కాలేజీలో ప్రవేశం లభించాలని కోరుకుంటారు. అందుకు కోచింగ్‌ ఫీజుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. విద్యార్థులు సైతం తమ లక్ష్యం, తల్లిదండ్రుల ఆశయం నెరవేరేలా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలైన ఐఐటీలు, నిట్‌లలో ప్రవేశానికి మార్గం వేసే జేఈఈ మెయిన్, తెలుగు రాష్ట్రాల స్థాయిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ కల్పించే ఎంసెట్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి వీలు కల్పించే నీట్‌ పరీక్షలు త్వరలో జరుగనున్నాయి.

ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ పొందేలా చేయూత అందించేందుకు సాక్షి ముందుకు వచ్చింది. నిపుణుల ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్, ఎంసెట్, నీట్‌ పరీక్షలకు మాక్‌ టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్‌ టెస్టులు రాయడం ద్వారా.. విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకొని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపర్చుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్‌ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్‌ టెన్‌ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. పరీక్షలకు సంబంధించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సాక్షి మాక్‌ టెస్టులు"

Post a Comment