గాలి నుంచి విద్యుత్తు
- ఉత్పత్తి చేసే పరికరం ఆవిష్కరణ
బోస్టన్, ఫిబ్రవరి 18: గాలి నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే
దిశ గా అమెరికాలోని మసాచూసెట్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఓ ముంద డుగు వేశారు. గాలిలోని నీటి ఆవిరి(వాటర్ వేపర్)తో విద్యుత్తును ఉత్పత్తి చేయగల ‘ఎయిర్ జెన్’ అనే పరికరాన్ని అభివృద్ధి చేశారు. ‘జియోబ్యాక్టర్’ అనే బ్యాక్టీరియాల నుంచి సేకరించిన ప్రొటీన్లతో రూ పొందించిన నానోవైర్లకు ‘ఎయిర్ జెన్’కు ఉండే రెండు ఎలకో్ట్రడ్లను అను సంధానించగానే వాటి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది.
ఈ క్రమంలో నానోవైర్లు, ఎయిర్‌జెన్ నడుమ ఉండే గాలిలోని నీటి ఆవిరి నుంచి విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. జియోబ్యాక్టర్ బ్యాక్టీరియాలు వాటి కణాలతో 50 మైక్రోమీటర్ల కంటే మందంగా ఉండే బయోఫిల్మ్‌లను తయారు చేయ గలవు. ఆ ఫిల్మ్‌లతో ఎసిటేట్ అనే రసాయనాన్ని విద్యుత్తుగా మార్చే వీలుంటుంది. వాటిలో ఉన్న ఈ ప్రత్యేక గుణమే గాలి నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు దోహదం చేస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.
0 Response to "గాలి నుంచి విద్యుత్తు"
Post a Comment