విద్యార్థుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదు : హైకోర్టు
ప్రజాశక్తి-అమరావతి :
విద్యా సంస్థల వార్షికోత్సవాలు, క్రీడోత్సవాలు, టీచర్స్ డే, ఫ్రెషర్స్ డే వంటి పేర్లతో నిర్వహించే కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను విద్యార్థుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు తామిచ్చిన ఉత్తర్వులను ఖాతరు చేయని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశించింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జికె.మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఉత్తర్వులిచ్చింది. కార్పొరేట్ పాఠశాలలు వార్షికోత్సవాల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ లాయర్ ఎస్.రాజశేఖర్ గతంలో వేసిన పిల్‌ను బెంచ్ సోమవారం మరోసారి విచారించింది

0 Response to "విద్యార్థుల నుంచి వసూలు చేయడానికి వీల్లేదు : హైకోర్టు"
Post a Comment