20న ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్
26 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఏప్రిల్ 20-24 వరకు పరీక్షలు
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు
అమరావతి(ఆంధ్రజ్యోతి): ఎంసెట్-2020 షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదలతో
క్రియ మొదలు కానుంది. ఈ నెల 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
ప్రారంభమవుతుంది. మార్చి 27 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రూ.500 ఆలస్య
రుసుంతో ఏప్రిల్ 4 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9 వరకు, రూ. 5000
ఆలస్య రుసుంతో ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు
చేసుకున్న అభ్యర్థులు ఏప్రిల్ 16 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్
చేసుకోవచ్చు. రూ.10,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకునే
అవకాశం కూడా కల్పించారు. ఎంసెట్-ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ఏప్రిల్
20, 21, 22, 23 తేదీల్లో జరగనుంది. ఎంసెట్-అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్ష
ఏప్రిల్ 23-24 తేదీల్లో జరగనుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్.. ఈ రెండు
స్ట్రీమ్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 22-23 తేదీల్లో
పరీక్ష నిర్వహిస్తారు. ఎం సెట్ ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో
జరుగుతుంది. సోమవారం జరిగిన ఎంసెట్-సెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు
షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి
చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఎంసెట్- 2020 కమిటీ చైర్మన్ రామలింగరాజు,
ఎంసెట్-2020 కమిటీ కన్వీనర్ వి.రవీంద్ర పాల్గొన్నారు. ఎంసెట్
రాయదలచుకున్న అభ్యర్థులు ఒక స్ట్రీమ్‌కు అయితే రూ.500, రెండు స్ట్రీమ్‌లకు
అయితే రూ.1000 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ సారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్
అమలు కానుంది. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుంది
0 Response to "20న ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్"
Post a Comment