పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎన్నికలు
నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు
కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్‌కుమార్ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న సన్నాహకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల మార్గనిర్దేశకాలు, నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి ఓట్ల లెక్కింపు వరకూ ప్రస్తుతమున్న 27 రోజుల కాలవ్యవఽధిని 20 రోజులకు తగ్గించనున్నందున తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా నవీకరణ(అ్‌పడేషన్)- ముద్రణ, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకోవడం, పట్టణ స్థానిక సంస్థలన్నింట్లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరుల నియామకం, మైక్రో అబ్జర్వర్ల గుర్తింపు తదితరాలపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించాలని రమేశ్ కుమార్ సూచించారు
0 Response to "పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎన్నికలు"
Post a Comment