నేటి నుంచి మూడోవిడత ‘కంటి వెలుగు’!
కర్నూలులో ప్రారంభించనున్న సీఎం జగన్
56.88 లక్షల మంది వృద్ధులకు కంటి పరీక్షలు
నాడు-నేడు, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ
అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 60 ఏళ్లు వయసు దాటిన వారికి కంటి పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో మూడో విడతగా జూలై 31 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని కర్నూలులో మంగళవారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో 66 లక్షల మంది పిల్లలకు ఆరోగ్యశాఖ కంటి పరీక్షలు చేసింది. 4.36 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించింది. ఇప్పుడు మూడో విడత.. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన 56,88,424 మంది అవ్వాతాతలకు గ్రామ సచివాలయాల్లో స్కీనింగ్ నిర్వహించనున్నారు.
దీంతో పాటు.. ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు సమానంగా అప్‌గ్రేడ్ చేయడమే లక్ష్యంగా ఆస్పత్రుల్లో నాడు- నేడు కార్యక్రమానికి కూడా సీఎం జగన్ శ్రీకారం చుడుతున్నారు. అలాగే, ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కార్డుల పంపిణీని కూడా సీఎం మంగళవారం ప్రారంభిస్తారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేయడంతో పాటు రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందించనున్నారు
0 Response to "నేటి నుంచి మూడోవిడత ‘కంటి వెలుగు’!"
Post a Comment