మరో సారి డిల్లి ముఖ్యమంత్రి గా కేజ్రివాల్ తాజా ఎన్నికల్లో గెలుపు
ఆప్ 62.. బీజేపీ 8
ఎలాంటి గందరగోళం, ఉత్కంఠ లేదు. వార్ వన్ సైడ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించిన ఫలితాలతో ‘సామాన్యుడి’ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 చోట్ల

గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాగా,
కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ సారి కూడా ఒక్కటంటే ఒక్క స్థానంలో
కూడా గెలవకపోగా.. ఏ తరుణంలోనూ కనీసం ఆధిక్యం కూడా ప్రదర్శించ లేదు. ఇక
వరుసగా మూడో సారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
చేయనున్నారు. ఇక 2015లో ఆప్ 67 స్థానాల్లో ఆప్ జయకేతనం ఎగురవేయగా..
బీజేపీ 3 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక తాజా ఎన్నికల్లో ఆప్
ఐదు స్థానాలను చేజార్చుకోగా.. బీజేపీ మరో ఐదు స్థానాలను తన ఖాతాలో
వేసుకుంది. ఇంతకుమించి 2015 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల ఫలితాల్లో
పెద్దగా తేడా ఏం కనిపించలేదు

0 Response to "మరో సారి డిల్లి ముఖ్యమంత్రి గా కేజ్రివాల్ తాజా ఎన్నికల్లో గెలుపు"
Post a Comment