ఏపీ ప్రజలకు షాక్.. భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు.

Current Charges Increase: ఏపీ ప్రజలకు షాక్ తగిలింది. విద్యుత్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరం గానూ విద్యుత్ రిటైల్ సప్లై టారిఫ్‌ను ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ తాజాగా విడుదల చేసింది. దీనితో 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు పెను భారం పడనుంది.




ఈ ప్రభావంతో ఏపీలో 500 యూనిట్లు పైబడి వాడుతున్న సుమారు 1.35 లక్షల వినియోగదారులకు యూనిట్‌కి రూ. 9.05నుంచి రూ. 9.95కు పెరగనుంది. ముఖ్యంగా ప్రభుత్వ, కొర్పొరెట్ సంస్థలపై అధిక భారం పడనుంది. పెంచిన చార్జీలతో దాదాపు రూ.1300 కోట్లు భారం పడనుంది. అటు ప్రభుత్వ పాలసీ ప్రకారం రైతులకు 9 గంటల విద్యుత్ అందించనున్నారు

ఈ క్రమంలోనే ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెను భారం పడనుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ ప్రజలకు షాక్.. భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు."

Post a Comment