కొత్త పన్ను విధానంలోకి 80% మంది
'కొత్త పన్ను విధానంలోకి 80% మంది'
ముంబయి: కొత్త ఆదాయపు పన్ను విధానంలోకి సుమారు 80 శాతం మంది పన్ను చెల్లింపుదారులు చేరతారని అంచనా వేస్తున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన బడ్జెట్‌లో రెండు పన్ను విధానాలు తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో పన్ను మినహాయింపులతో కూడిన పాత విధానంతో పాటు.. మినహాయింపులు లేని తక్కువ పన్ను రేటుతో కూడిన కొత్త విధానం తీసుకొచ్చారు. ఇందులో ఏదో ఒకదాన్ని ఎంచుకునే వెసులుబాటు చెల్లింపుదారులకు ఉంది
ఈ నేపథ్యలో ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో అజయ్‌భూషణ్ పాండే మాట్లాడుతూ.. ''సుమారు 80 శాతం మంది కొత్త పన్ను విధానంలోకి మారుతారని అంచనా వేస్తున్నాం. బడ్జెట్‌కు ముందు 5.78 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులున్నారు. అందులో 69 శాతం మందికి కొత్త పన్ను విధానమే మేలు. 11 శాతం మంది పాత విధానంపై మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక మిగిలిన 20 శాతం మంది విషయానికొస్తే.. కాగితాల చిక్కు నుంచి తప్పించుకోవడానికి అందులో కొందరు కొత్త పద్ధతిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది'' అని అన్నారు. తక్కువ పన్నును ఎంపిక చేసుకునే వెసులుబాటును తాము కల్పిస్తున్నామే తప్ప.. పన్ను విధానానికి భంగం కలిగించడం లేదని తెలిపారు. ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులకు కొత్త పన్ను విధానమే మేలని అజయ్ భూషణ్ పాండే అభిప్రాయపడ్డారు
0 Response to "కొత్త పన్ను విధానంలోకి 80% మంది"
Post a Comment