సీఐఎస్ఎఫ్ లో 1.20 లక్షల ఉద్యోగాలు


న్యూఢిల్లీ : పారామిలిటరీ ఫోర్స్... దాదాపు 1.2 లక్షల రిటైర్డ్ డిఫెన్స్, మాజీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) సిబ్బందిని నియమించాలని యోచిస్తోంది. హోంశాఖ మంత్రిత్వ శాఖ

పరిధిలోకి వచ్చే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) ఈ సిబ్బందిని నియమించడానికి ఏర్పట్లు చేసింది. ఐదేళ్ల కోసం ఈ నియామకాలను చేపడతారు. 




ఇందుకు సంబంధించి... సిఐఎస్ఎఫ్ డిజి అధ్యక్షతన కిందటి సంవత్సరం నవంబరు 18 న వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. పోస్టుల సీలింగ్ పరిమితిని 1,80,000 నుండి 2,15,000 లకు పెంచే ప్రతిపాదనతో పాటు 4 రిజర్వ్ బెటాలియన్లను కిందటి సంవత్సరం మే 27 న కేంద్రానికి అందించారు. అయితే    సీలింగ్ పరిమితిని 1,80,000 నుండి 3,00,000 పోస్టులకు పెంచే ప్రతిపాదనను తిరిగి నివేదించాలని DG కార్యాలయం జారీ చేసిన సీఐఎస్‌ఎఫ్ లేఖలో ఎంహెచ్‌ఏ పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సీఐఎస్ఎఫ్ లో 1.20 లక్షల ఉద్యోగాలు"

Post a Comment