ఏపీ స్థానిక ఎన్నికల ప్రక్రియపై ఆర్డినెన్స్ జారీ
అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి రుజువైతే అనర్హత వేటు పడేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా,
గ్రామాభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజూ పాల్గొనాలని ఆర్డినెన్స్‌లో పేర్కొంది. స్థానిక ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. లెక్కింపు సమయం మినహా మొత్తం 13 నుంచి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించేలా ఆర్డినెన్స్ జారీ చేసింది
పంచాయితీ ఎన్నికల్లో ప్రచార గడువు 5 రోజులుగా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచార గడువు 7 రోజులుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
0 Response to "ఏపీ స్థానిక ఎన్నికల ప్రక్రియపై ఆర్డినెన్స్ జారీ"
Post a Comment