శాతవాహనుల కాలం నాటి ఇటుకల బావి వెలుగులోకి..!
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో శాతవాహనుల కాలం నాటి బావి వెలుగుచూసింది. క్రీ.పూ.200-230 మధ్య దీన్ని ప్రత్యేకంగా ఇటుకలతో నిర్మించినట్టు తెలుస్తోంది. ఒక్కో ఇటుక 40 సెం.మీ. పొడవు, 20 సెం.మీ. వెడల్పు, 20 సెం.మీ మందం ఉంది. తేర్ పట్టణంలో ఉన్న 'రామలింగప్ప లామెచ్యూర్ మ్యూజియం'ను మరోచోటకు తరలించేందుకు ఇటీవల నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం తవ్వకాలు చేపట్టగా గత నెల 14న ఈ బావి బయటపడినట్టు పురావస్తుశాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు
0 Response to "శాతవాహనుల కాలం నాటి ఇటుకల బావి వెలుగులోకి..!"
Post a Comment