క్యాట్ ఫలితాలు: 10మందికి 100%
టాపర్లలో తెలంగాణ నుంచి ఒకరు
దిల్లీ: కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) ఫలితాలు శనివారం వెలువడ్డాయి. ఈ ఏడాది 10 మంది అభ్యర్థులు 100శాతం స్కోర్ సాధించడం విశేషం. వీరంతా అబ్బాయిలే. టెక్నాలజీ, ఇంజినీరింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన 10 మంది నూరుశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఐఐఎం కోలికోడ్ ప్రకటించింది. వీరిలో మహారాష్ట్రకు చెందిన నలుగురు, ఝార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన వారు ఉన్నారు.
ఇక 21 మంది 99.99శాతం స్కోర్ సాధించారు. మొత్తం 1,34,917 మంది అబ్బాయిలు, 75,004 మంది అమ్మాయిలు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్స్ ఈ ఏడాది క్యాట్ పరీక్షకు హాజరయ్యారు
గత 10ఏళ్లలో ఇంత ఎక్కువ మంది క్యాట్ పరీక్ష రాయడం ఇదే తొలిసారి
0 Response to "క్యాట్ ఫలితాలు: 10మందికి 100%"
Post a Comment