ఆధార్‌-ఓటర్‌ ఐడీ అనుసంధానం


  • ఈసీ ప్రతిపాదనకు న్యాయశాఖ ఆమోదం
  • బడ్జెట్‌ సమావేశాల్లో

  • బిల్లు పెట్టే అవకాశం?
    న్యూఢిల్లీ, జనవరి 24:
    ఆధార్‌-ఓటర్‌ ఐడీ అనుసంధానానికి అనుమతి కోరుతూ ఎన్నికల కమిషన్‌ చేసిన విజ్ఞప్తికి కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తయారు చేసేందుకు వీలుగా కేబినెట్‌ నోట్‌ను రూపొందిస్తోంది. దీన్ని బడ్జెట్‌ సమావేశాల సమయంలో.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని న్యాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. సంబంధిత బిల్లును కూడా ఈ బడ్జెట్‌ సమావేశాల్లో పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఆధార్‌ డేటా ఆధారంగా ఓటర్‌ జాబితాను ప్రక్షాళన చేసేందుకు వీలుగా ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఆధార్‌ యాక్ట్‌ 2016కు సవరణలు ప్రతిపాదిస్తూ ఎన్నికల కమిషన్‌ గత ఏడాది ఆగస్టులో కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి ఒక లేఖ రాసింది



    ఈసీ ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. ఇప్పటికే ఓటర్‌ ఐడీ కలిగినవారిని ఆధార్‌ నంబర్‌ సమర్పించాలని కోరేందుకు, కొత్తగా ఓటర్‌ ఐడీ కోసం దరఖాస్తు చేసేవారి నుంచి ఆధార్‌ నంబర్‌ అడిగేందుకు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌కు (ఈఆర్‌వో) అధికారం ఉంటుంది. అలాగని.. ఓటు హక్కు కోరే వ్యక్తి ఆధార్‌ నంబర్‌ సమర్పించనంత మాత్రాన వారికి కొత్తగా ఓటర్‌ గుర్తింపు కార్డును తిరస్కరించే హక్కు, ఉన్న గుర్తింపు కార్డును తీసేసే హక్కు ఈఆర్‌వోలకు ఉండదు. ఆధార్‌-ఓటర్‌ ఐడీ అనుసంధానం వల్ల ఒకే వ్యక్తి పలు చోట్ల ఓటు హక్కు పొందడాన్ని, బోగస్‌ ఓటర్లను అడ్డుకోవచ్చని ఈసీ చెబుతోంది. ఈసీ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన న్యాయశాఖ.. డేటా గోప్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాము తీసుకున్న జాగ్రత్తల గురించి వివరిస్తూ గత ఏడాది డిసెంబరులో న్యాయశాఖకు ఈసీ వివరించింది. దీంతో న్యాయశాఖ తదుపరి చర్యలు చేపట్టింది

    SUBSCRIBE TO OUR NEWSLETTER

    0 Response to " ఆధార్‌-ఓటర్‌ ఐడీ అనుసంధానం"

    Post a Comment