పాన్, ఆధార్ ఇవ్వకుంటే 20శాతం పన్ను
- ఉద్యోగులకు మూలం వద్దే కోత పెట్టండి
- సంస్థలకు ఆదాయపన్ను శాఖ సూచన
న్యూఢిల్లీ, జనవరి 24:
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్), ఆధార్ ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం లేదా వారి
ఆదాయాన్ని బట్టి అంతకు మించి.. మూలం వద్దే పన్ను కోత పెట్టాలని ఆదాయపన్ను
శాఖ.. కంపెనీలు,
సంస్థల యాజమాన్యాలకు గుర్తుచేసింది. ఆదాయపన్ను చట్టం
ప్రకారం ఉద్యోగులు తమ పాన్‌ను యాజమాన్యానికి ఇవ్వాలి. అలా ఇవ్వని వారి
ఆదాయాన్ని బట్టి మూలం వద్దే పన్ను కోత పెట్టాలి. వారి
ఆదాయం 20ు పన్ను
పరిధిలోకి వచ్చినా.. పాన్, ఆధార్ ఇవ్వకపోతే 20ు కోత పెట్టాలి. అంతకు
మించి ఆదాయం ఉంటే సగటు రేటును
ప్రామాణికంగా తీసుకుని మూలం వద్ద పన్ను కోత
విధించాలి. ఈ మేరకు ఒక సర్క్యులర్‌ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గత
వారమే అన్ని సంస్థలకూ జారీ చేసింది
0 Response to " పాన్, ఆధార్ ఇవ్వకుంటే 20శాతం పన్ను"
Post a Comment