వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌

ఢిల్లీ ఎన్నికల్లో వృద్ధుల కోసం ఈసీ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులతోపాటు దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు సీఈసీ సునీల్‌ అరోరా తెలిపారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకుంటే నోటిఫికేషన్‌ జారీ అయిన ఐదు రోజుల్లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ విధానాన్ని జార్ఖండ్‌ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసినట్లు, ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌"

Post a Comment