8న విద్యార్థులకు పరీక్ష
కడప విద్య, న్యూస్‌టుడే: గండికోట ఉత్సవాలు 2020లో భాగంగా పాఠశాల విద్యార్థులకు కడప, ప్రొద్దుటూరు, రాయచోటి డివిజన్లలో జనవరి 8వ తేదీన 'గండికోట అలనాటి చారిత్రక వైభవం - నేటి ప్రగతి' అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నామని జిల్లా విద్యాశాఖాధికారి శైలజ ప్రకటనలో పేర్కొన్నారు. అదే రోజు 'గండికోట కళావైభవం' అనే అంశంపై పెయింటింగ్ పోటీలు జరపనున్నామని తెలిపారు. డివిజన్ స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఈ నెల 9వ తేదీన కడప నగరం జిల్లాపరిషత్ కార్యాలయ ఆవరణలోని డీసీఈబీ హాలులో జిల్లా స్థాయి పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 6, 7 తరగతుల విద్యార్థులను జూనియర్స్, 8, 9, 10 తరగతుల విద్యార్థులను సీనియర్స్‌గా పరిగణిస్తారని తెలిపారు
0 Response to "8న విద్యార్థులకు పరీక్ష"
Post a Comment