కనీస పెన్షన్ 6,000?
- బడ్జెట్‌లో ప్రైవేటు ఉద్యోగులకు తీపి కబురు!
న్యూఢిల్లీ, జనవరి 24: మరో
వారంలో రానున్న కేంద్ర బడ్జెట్ ప్రైవేటు రంగ ఉద్యోగులకు తీపి కబురు తెచ్చే
అవకాశం ఉంది. కొత్త పెన్షన్ పథకం (ఈపీఎ్‌స)లో వారి కనీస పెన్షన్‌ను
పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. పెన్షన్ పెంపు కోసం యూనియన్లు
చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ డిమాండ్‌ను నెరవేర్చనున్నారని
తెలిసింది. ప్రస్తుతం నెలకు రూ.1,000 ఉన్న కనీస పెన్షన్‌ను రూ.6,000కు
పెంచే అవకాశం ఉంది.
ప్రభుత్వం వద్ద దాదాపు రూ.3 లక్షల కోట్లు పెన్షన్ నిధులు
ఉన్నాయి. అసంఘటిత కార్మికులతో పాటు వ్యాపారులకు సైతం ఇస్తున్న పెన్షన్
అయినా ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఇవ్వకపోవడం ఏమిటన్నది యూనియన్లు
వినిపిస్తున్న వాదన. దీంతో ఈ అంశంపై కేంద్ర దృష్టి సారించింది. నెలకు
రూ.5,000 మేరకు కనీస పెన్షన్ పెంచాలని కసరత్తు పూర్తి చేసింది. ఇదే
కాకుండా గతంలోని కమ్యుటేషన్ పద్ధతిని పునరుద్ధరిస్తుందని భావిస్తున్నారు. ఈ
విధానంలో ఉద్యోగులు రిటైర్మెంట్ సమయంలో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)తో
పాటు కొంత పెన్షన్ మొత్తాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే 15 ఏళ్ల
పాటు నెలవారీ పెన్షన్ మూడోవంతు తగ్గుతుంది. 2009లో నిలిపివేసిన ఈ పద్ధతిని
పునరుద్ధరించాలని ఈపీఎఫ్‌వో కోరుతోంది. 6.5 లక్షల మంది ఉద్యోగులకు ఇది
లబ్ధి చేకూరుస్తుంది. కొత్తగా ఈఎ్‌సఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల ఏర్పాటు
ప్రకటనా వెలువడే అవకాశం ఉంది
0 Response to " కనీస పెన్షన్ 6,000?"
Post a Comment