వచ్చే ఏడాదిలో ప్రభుత్వ సెలవు దినాలు ఏవి?

ప్రభుత్వ సెలవుల ప్రకటన ఎప్పుడొస్తుందా? అని ఉద్యోగులు, ఇతర వర్గాలు ఎదురుచూస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ సెలవు దినాలు ఏవి? ఏయే తేదీల్లో వచ్చాయన్న విషయాన్ని ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తుంది. ఉదాహరణకు 2019లో ప్రభుత్వ సెలవు రోజులను 2018నవంబరు 14వ తేదీనే ప్రకటించారు. 2020కి సంబంధించి ఇంకా అలాంటి ప్రకటనేదీ రాలేదు. సంక్రాంతి, ఉగాది, దీపావళి, క్రిస్మస్‌, రంజాన్‌ లాంటి పండుగలతో పాటు పలు సందర్భాలను 


పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులుంటాయి. ప్రభుత్వం ఒక జీవో ద్వారా సెలవులను ప్రకటించాల్సి ఉంది. ఈ సెలవులను బట్టి ఉద్యోగులు, వారి కుటుంబాలు.. పర్యటనలు, స్వగ్రామాలకు వెళ్లడం, ఇతర పనుల కోసం ముందస్తు ప్రణాళిక వేసుకుంటారు

దూర ప్రయాణాల కోసం టికెట్లు రిజర్వు చేసుకుంటారు. మరోవైపు కొంతమంది డైరీలు ముద్రిస్తుంటారు. వాటిలో కూడా పండుగలు-ప్రభుత్వ సెలవు దినాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ సెలవుల ప్రకటన వస్తేనే.. విద్యాశాఖ, విద్యాసంస్థలు పరీక్షల క్యాలండర్‌ రూపొందిస్తాయి. సెలవులు ఎప్పుడో తెలియకుండా క్యాలండర్‌ ప్రకటించినా.. మళ్లీ మళ్లీ మార్పులు చేయాల్సి ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వచ్చే ఏడాదిలో ప్రభుత్వ సెలవు దినాలు ఏవి?"

Post a Comment