ఉమ్మడి పాస్‌కు ఉద్యుక్తం!
బస్సు.. రైలు.. క్యాబ్.. ఆటోల్లో చెల్లుబాటుకు కసరత్తు
క్యూఆర్ కోడ్ టిక్కెటింగ్‌తో సాధ్యమంటున్న సాంకేతిక సంస్థలు
ఈనాడు, హైదరాబాద్
ఆధునిక సాంకేతికత.. ఉమ్మడి పాస్ కలను సాకారం చేయబోతుందా? అంటే అవుననే అంటున్నాయి టెక్నాలజీ సంస్థలు. క్యూఆర్‌కోడ్ టిక్కెటింగ్‌తో రాబోయే రోజుల్లో ఉమ్మడి పాస్ సాధ్యమేనంటున్నాయి. ఈదిశగా నగర రవాణాలో అడుగు ముందుకు పడింది. మెట్రోలో క్యూఆర్‌కోడ్ టిక్కెట్ అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్తులో బస్సు, ఎంఎంటీఎస్‌కు కూడా ఈ సేవలు విస్తరించనున్నారు
* కామన్ పాస్.. నగర రవాణాలో ఎంతోకాలంగా వినిపిస్తున్న ఉమ్మడి కార్డు విధానం. బస్సు, ఎంఎంటీఎస్, మెట్రో, క్యాబ్, ఆటో, షటిల్ సర్వీసెస్ అన్నింట్లోనూ చెల్లుబాటయ్యేలా కామన్ పాస్ తీసుకురావాలని వేర్వేరు ప్రభుత్వ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. వేర్వేరు ప్రజరవాణా సంస్థలతో సమన్వయం, ఆదాయం పంచుకోవడం, సాంకేతికత, వ్యయం చాలా విషయాలు ముడిపడి ఉండటంతో ఆశించిన పురోగతి లేదు. రెండేళ్ల క్రితం మెట్రో ప్రారంభంతో స్మార్ట్‌కార్డు అందుబాటులోకి వచ్చింది.
సాంకేతికలో మార్పులతో..
స్మార్ట్‌కార్డులకూ ఇప్పుడు కాలం చెల్లింది. యాప్ ఆధారంగా పనిచేసే క్యూఆర్‌కోడ్ టిక్కెటింగ్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది మెట్రోలో మాత్రమే పనిచేస్తుంది. మెట్రో దిగిన ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ఎల్ అండ్ టీ మెట్రో కొన్నిస్టేషన్ల నుంచి షటిల్ బస్సులను నడుపుతోంది. వీటికి క్యూఆర్ కోడ్ టిక్కెటింగ్ కొద్దినెలల్లోనే రాబోతుంది. సైదాబాద్‌లోని ఒక వ్యక్తి కొండాపూర్ చేరుకోవాలంటే ప్రస్తుతం మూడురకాల రవాణా వాహనాలను ఉపయోగించాల్సి వస్తోంది. సైదాబాద్ నుంచి బస్సులో చాదర్‌ఘాట్ స్టేషన్‌కు.. అక్కడి నుంచి మెట్రోలో హైటెక్‌సిటీలో దిగి.. అక్కడి షటిల్ సర్వీసులో కొండాపూర్ చేరుకోవాలి. ఇలా మూడుసార్లు టిక్కెట్ తీసుకుంటున్నారు. క్యూఆర్‌కోడ్ సాంకేతికతతో ఒకటే టికెట్ మీద సైదాబాద్ నుంచి కొండాపూర్‌కు చేరుకోవచ్చు. భవిష్యత్తులో ఇది సాధ్యమే అంటున్నారు 'మేక్ మై ట్రిప్' సీఈవో రాజేశ్. విమాన ప్రయాణికులు ఎక్కడ ఆగాల్సిన పనిలేకుండా క్యూఆర్‌కోడ్ చూపించి చెక్‌ఇన్ అవుతున్నారని.. ఇదే సౌకర్యం మిగతా వాటికి వర్తింపజేయవచ్చన్నారు.
ఔత్సాహికవేత్తలకు ఆహ్వానం
- ఎన్వీఎస్‌రెడ్డి, ఎండీ, హైదరాబాద్ మెట్రోరైలు
ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ 'మేక్ మై ట్రిప్' దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మెట్రోలో క్యూఆర్ కోడ్ టిక్కెటింగ్ తీసుకొచ్చింది. అత్యాధునిక మెట్రో నిర్మాణం మొదటిదశ అయితే.. సేవల్లో సాంకేతిక వినియోగంతో రెండోదశ మొదలైంది. సాంకేతికత రంగంలో ఉన్న ఔత్సాహికవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నాం.
* మెట్రోలో వచ్చే నెలాఖరు నాటికి మొత్తం 57 రైళ్లను తిప్పనున్నాం. ప్రస్తుతం 48 నడుస్తున్నాయి. సగటున ఒక్కో మెట్రోలో 600 మందికి మించడం లేదు. ప్రస్తుతం రద్దీ సమయాల్లో 3 నిమిషాలకు ఒకటి, మిగతా సమయాల్లో ఆరేడు నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నాం. వచ్చేనెల నుంచి వేగంతోపాటు రైళ్ల సంఖ్యా పెంచనున్నాం.
* 'మేక్ మై ట్రిప్'లోనూ టిక్కెట్లపై ఆ సంస్థ ఎప్పటికప్పుడు ఆఫర్లను ఇస్తుంది. మొదటి రెండు టిక్కెట్ల బుకింగ్‌పై 50 శాతం, మొదటి టిక్కెట్ బుకింగ్‌తో రెండో టిక్కెట్ రూపాయికే
0 Response to "ఉమ్మడి పాస్‌కు ఉద్యుక్తం!"
Post a Comment