అమ్మబడి'కి ఆరు steps

అమ్మబడి'కి ఆరు steps3౦లోగా వడపోత పూర్తి ౫ నిజమైన లజ్ధిదారులకే చాన్స్‌ ౫) మార్పు, చేర్పులకు హెచ్‌ఎంలకు స్వేచ్చ ౫ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే ౫) అధికారులకు పాఠశాల విద్యాశాఖ నిర్దేశం అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్న 'జగనన్న అమ్మఒడి" పథ కానికి సంబంధించిన లబ్ధిదారులను మొత్తం ఆరు అంచెల్లో ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల ఖైలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను పాఠ శాల విద్యాశాఖ ఆదేశించింది. అర్హులైన తల్లులు/ సంరక్షకుల జాబితాలను సిద్ధం చేసేందుకు వీలుగా జిల్లా, మండల, పాఠశాల, గ్రామస్తాయిల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళి కను ఖరారు చేసింది. మొత్తం 6 అంచెల్లో లబ్ధిదారులను పరిశీలించి, ఎలాంటి విమర్శలకూ తావులేకుండా ఎంపిక చేయాలని విద్యాశాఖ సూచించింది. + ఈ నెల 1 నుంచి 21 మధ్యకాలంలో ప్రధానోపాధ్యా యులు విద్యార్థుల వివరాలను చైల్డ్‌ ఇన్ఫోలో నమోదు చేని, 21న ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌కి అందజేశారు. + ఏపీనీఎఫ్‌ఎస్‌ఎస్‌ పరిశీలించి, రేషన్‌ కార్డుల జాబితా, ప్రజా సాధికార సర్వే సమాచారంతో సరిపోల్చి తెల్లరే షన్‌ కార్డులో ఉన్న తల్లుల/సంరక్షకుల వివరాలను సేక రించి, విద్యార్థుల వారీగా 28 నాటికి అనుసంధానం చేయాలి. అనంతరం దీనిని హెచ్‌ ఎంలకు పంపాలి. + ప్రధానోపాధ్యాయులు ఆవివరాలను నరిపోల్చుకోవడం, నమోదు చేయడం, విద్యార్థుల, తల్లి/ సంరక్షకుల పేరు, ఆధార్‌ నెంబరు, బ్యాంక్‌ ఖాతా వివరాలను £4లోపు సేక రించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. + ఏపీనీఎఫ్‌ఎస్‌ఎస్‌ ద్వారా అందిన వివరాల్లో లోపాలుంటే వాటిని నరిదిద్దాలి. ఆ తర్వాత విద్యార్దుల స్వగ్రామాలు, మండలాల వారీగా తల్లులు/సంరక్షకుల జాబితాను మండల విద్యాధికారి(ఎంఈవో)కి పంపాలి. + 100 మందిలోపు విద్యార్థులున్న పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఈ సమాచారాన్ని ఈ నెల 25లోగా 101 నుంచి 800 మందిలోపు విద్వార్థులున్న పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఈ సమాచారాన్ని 28లోగా, 800లకు పైగా విద్యార్థులుంటే ఈ సమాచారాన్ని £₹/లోగా ఆన్‌లైన్‌లో ఎంఈవోకు పంపాలి. + ఎంఈవోలు తమకు చేరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు గ్రామాలు/వార్డుల వారీగా జాబితాలను ముద్రించి గ్రామ నచివాలయ విద్యా, సంక్షేమ నసహాయకునికి లేదా క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌కు అందజేయాలి. + గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు/ క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ ఎంఈవో ద్వారా అందిన జాబితాలను నంబంధిత గ్రామ/వార్డు వలంటీర్లకు ఇవ్వాలి. వారి ద్వారా సమాచారాన్ని ఆయా కుటుంబాలకు వివరించి. లేని వివరాలు అంటే... తల్లి 'పేరు, తెల్లరేషన్‌ కార్డు వివ రాలు, ఆధార్‌ నెంబరు, బ్యాంక్‌ ఖాతా నెంబరు, ఐఎఫ్‌ఎ్‌ ఎనీ కోడ్‌ తదితర వివరాలను సేకరించాలి. ఆ సమాచా రంలో తెల్లరేషన్‌ కార్డు లేనివారి విషయంలో వారు నిరు 'పేద/అర్హత కలిగిన 



కుటుంబాలకు చెందిన వారు అవునో కాదో 6 అంచెల పరిశీలన ద్వారా నిర్ధారించాలి. ఈ కార్యక్రమం $80లోగా పూర్తి చేయాలి. గ్రామ/వార్డు వలంటీర్లు క్షేత్రస్థాయిలో నమోదు చేనిన/నిర్గారించిన సమాచారాన్ని వీద్యా, సంక్షేమ సహాయకుడు/క్షస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ల ద్వారా తిరిగి ఎంఈవోకి పంపాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అమ్మబడి'కి ఆరు steps"

Post a Comment