వాట్సప్ గ్రూప్‌కి పేరు పెడుతున్నారా? జాగ్రత్త
ఆయన సభ్యుడిగా ఉన్న యూనివర్శిటీ వాట్సప్ గ్రూపు పేరును పిల్లల లైంగిక వేధింపుల అర్థం వచ్చేలా గ్రూపు సభ్యుడొకరు మార్చారు. దాన్ని కారణంగా చూపుతూ వాట్సప్ ఆ గ్రూపుని, గ్రూపులోని సభ్యులందరినీ సస్పెండ్ చేసినట్లుగా తెలిపారు. దీనికి సంబంధించి వారు వాట్సప్‌ను సంప్రదించగా నిబంధనలు అతిక్రమించారనే కారణంతో వారిపై నిషేధం విధించినట్లుగా పేర్కొంది. ఒక వారం తర్వాత ఎటువంటి సమాచారం లేకుండానే తిరిగి ఆ గ్రూపును పునరుద్ధరించినట్లుగా తెలిపారు. యాభై మంది సభ్యులున్న మరో వాట్సప్ గ్రూపు పేరు 'డిస్గస్టింగ్'గా మార్చారు. అలా మార్చిన కొద్ది గంటల్లోనే సభ్యులందరినీ వాట్సప్ నిషేధించింది. తిరిగి 27 రోజుల నిషేధకాలం తర్వాత ఆ ఖాతాలను పునరుద్ధరించినట్లు మరో యూజర్ తెలిపారు.
ఈ నిషేధ ప్రక్రియ ఆటోమేటెడ్ ప్రాసెస్‌గా పలువురు అభిప్రాయపడుతున్నారు. మెటాడేటా ద్వారా వాట్సప్ గ్రూపు ఐకాన్, పేరు ఆధారంగా సర్వర్ వాటిని ఆటోమేటిగ్గా తొలగిస్తున్నట్లు తెలుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, వాట్సప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ కారణంగా అవాస్తవాలు, ద్వేషపూరిత వార్తలు వ్యాపింపజేసే గ్రూపుల మధ్య సంభాషణను గుర్తించటం కష్టం. అటువంటి చట్టవిరుద్ధమైన గ్రూపులను కనుగొనేందుకు వాట్సప్ ఈ తరహా విధానాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, దీనివల్ల గ్రూపులో ఓ వ్యక్తి కారణంగా అందులోని సభ్యులందరూ నిషేధానికి గురవుతుండడం గమనార్హం. ఒకవేళ మీరు అడ్మిన్లుగా ఉన్న వాట్సాప్ గ్రూపు పేర్లు గానీ, ఐకాన్లుగానీ చట్ట విరుద్ధంగా ఉంటే వాటిని వెంటనే మార్చుకోండి. లేదంటే మీరూ నిషేధానికి గురికావాల్సి ఉంటుంది. జర జాగ్రత్త!
0 Response to "వాట్సప్ గ్రూప్‌కి పేరు పెడుతున్నారా? జాగ్రత్త"
Post a Comment