పాఠశాల విద్యాశాఖ కమీషనరు గారి కార్యావర్తనములు
ప్రస్తుతం శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్.
ఆర్.సి.నెం. 242/ఎ & ఐ/2019 తేది : 16.11.2019
విషయం _ : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి
వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు
పొందిన సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20
విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై సూచనలు.
నిర్దేశములు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-!!) వారి ఉత్తర్వులు నెం. 79,
తేది : ఉ11.2019
ఆదేశములు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ఎయిడెడ్ పాఠశాలల్లోనూ,
ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోనూ, జూనియర్ కళాశాలల్లోనూ మరియు అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల
పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ 1వ తరగతి నుండి ఇంటర్ మీడియట్ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు
చెందిన విద్యార్థుల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులు వారికి కుల, మత, ప్రాంత, వివక్షత లేకుండా
రూ. 15,000/- చొప్పున వారిక ఆర్థిక సహాయం అందించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై నిర్దేశం ద్వారా
ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు.
2. పై కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం “జగనన్న అమ్మఒడి” కార్యక్రమంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం
కింద ద్వారా లబ్బి పొందగల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకుల అర్హతలను, వార్షిక ఆర్థిక సహాయం
చెల్లింపు విధానాన్ని మరియు పర్యవేక్షణ విధానాన్ని ప్రభుత్వం పై ఉత్తర్వుల ద్వారా నిర్దేశించింది. ఆ మేరకు
అర్జులైన లబ్ధిదారుల గుర్తింపు మరియు విద్యార్థుల హాజరు, చెల్లింపు మొదలైన విధి విధానాలను ఆన్‌లైన్ ద్వారా
చేపట్టవలసినదిగా కూడా ఆదేశించింది.
3. ఇందుకు గాను ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు మరియు గుర్తింపు పొందిన సంరక్షకుల్లో
అర్హులైన వారి ఆధార్‌కార్టు వివరాలు, బాంకు అకౌంటు నెంబరు మరియు ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ వివరములు
సేకరించవలసి ఉన్నది. ఆ వివరాలతో పాటు ఆయా అర్హత కలిగిన తల్లులు లేదా సంరక్షకుల పిల్లలు కనీసం
75% హాజరు ఉన్నదీ లేనిదీ కూడా పరిశీలించి ధృవీకరించుకోవలసి ఉంది. ఈ వివరాలను గ్రామస్థాయిలో
ఏర్పాటైన గ్రామ సచివాలయం ద్వారా, గ్రామస్థులందరికి తెలియచేసి దానిలో ఆ సమాచారంలో ఏవైనా లోటుపాట్లు
ఉన్నట్లయితే వాటిని సామాజిక తనిఖీ ద్వారా సరిదిద్దుకోవలసి ఉన్నది.
4. _ ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ ప్రక్రియ ద్వారా అమలు పరచటం కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 20
నుండి డిసెంబరు 20 వరకు వైఎస్‌ఆర్ నవశకం పేరిట ఉద్యమస్థాయిలో అమలు జరుపటానికి నిశ్చయించింది.
ఈ పథకం కింద అర్హత కలిగిన తల్లుల, సంరక్షకుల వివరాలను సేకరించటానికి, ఆ వివరాలను సామాజిక తనిఖీ
ద్వారా ధృవీకరించుకోవటానికి, ఆ విధంగా ధృవీకరించుకున్న తరువాత తిరిగి ఆ సవరణలను ఆన్‌లైన్ ద్వారా
CLICK HERE TO DOWNLOAD
చేపట్టి అరల జాబితాలను ప్రకటించటానికి కభుత్వం టై టైం లైన్‌లను నిర్దేశించింది
0 Response to "పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల"
Post a Comment