పది వరకు తల్లి భాషే
- ఆ తర్వాతే మాధ్యమాల యోచన
- మాతృభాషలో ఉపాధి పెరగాలి
- అప్పుడే భాషలకు పునర్వైభవం
- కాన్వెంట్ విద్యతోనే పైకి రాం
- రాష్ట్రపతి, నేను, ప్రధాని చదివింది మా మాతృభాషల్లోనే: వెంకయ్య
న్యూఢిల్లీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):
‘‘మాతృభాషలో చదివే విద్యార్థులకు ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో
ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే దేశంలో వివిధ భారతీయ భాషలకు
పునర్వైభవం వస్తుంది’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పదో
తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి
సారించాలని ఆయన సూచించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన జవహర్‌లాల్ నెహ్రూ
యూనివర్సిటీ (జేఎన్‌యూ) మూడో
స్నాతకోత్సవానికి వెంకయ్య ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. ‘‘వీలైనన్ని భాషలు నేర్చుకోవాలి. కానీ పునాది మాతృభాషలోనే
ఉండాలి. 10వ తరగతి వరకు మాతృభాషలో చదివి, ఆ తర్వాత వేరే మాధ్యమాల్లో చేరితే
భాష, విషయం సులభంగా అలవడతాయి. కాన్వెంట్ స్కూళ్లలో చదవితేనే పైకి
వెళ్లగలమని అనుకోవడం పొరపాటు. రాష్ట్రపతి, నేను, ప్రధానమంత్రి, పలువురు
కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రాఽథమిక విద్యాభ్యాసం
మాతృభాషలోనే సాగింది.’’ అని పేర్కొన్నారు. భారత విద్యావిధానాన్ని
సమీక్షించాల్సిన అవసరం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. నైతికత, విలువలతో
కూడిన విద్యను అందించడంతో పాటు కళలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలపై
మరింత దృష్టి సారించాలన్నారు
దేశ అత్యున్నత విద్యా
సంస్థల్లో జేఎన్‌యూ రెండో స్థానంలో ఉండడం గర్వించదగ్గ విషయమని, కానీ
అంతర్జాతీయంగా ఉత్తమ విద్యా సంస్థల సూచీలో మొదటి వందలో దేశం నుంచి ఒక్క
వర్సిటీగానీ, కాలేజీగాని లేకపోవడం బాధాకరమన్నారు. దీన్ని బలహీనతగా
భావించవద్దని, మరింత కష్టపడి, చిత్తశుద్ధితో పనిచేస్తే సమీప భవిష్యత్తులో ఆ
స్థానాన్ని దక్కించుకుంటామని తెలిపారు. సానుకూల దృక్పథాన్ని అవలంభించాలని,
విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచాలని, పరిశోధనలకు మరిన్ని అవకాశాలు
కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం పీహెచ్‌డీ పట్టాలను వెంకయ్య ప్రదానం
చేశారు. ఈ పట్టాలు అందుకున్న వారిలో ఎక్కువ మంది మహిళలు ఉండడం పట్ల సంతోషం
వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు రాజకీయాల్లోనూ సరిపడా
రిజర్వేషన్లు కల్పించాలన్న ఆయన, మహిళల పాత్ర లేకుండా దేశాభివృద్ధిని
ఊహించలేమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి
రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్, జేఎన్‌యూ చాన్సలర్, నీతీ ఆయోగ్ సభ్యుడు
వీకే సారస్వత్, ఆ వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్
తదితరులు
0 Response to "పది వరకు తల్లి భాషే"
Post a Comment