ఏపీలో జూనియర్ కళాశాలలుగా మారనున్న స్కూళ్లు.
గుంటూరు (విద్య) : గుంటూరు జిల్లాలో ప్రభుత్వ, మున్సిపల్, జడ్పీ స్కూల్స్ దాదాపు 360వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే బాలబాలికలు దాదాపు 1.15 లక్షల ఉన్నట్లు సమాచారం. ఇందులో 6 నుంచి 10వ తరగతి వరకు 500పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు దాదాపు 100పైనే ఉన్నాయి. ఇందులో గుంటూరు నగరంలోని ప్రభుత్వం, మున్సిపల్స్ స్కూల్స్ పది వరకు ఉన్నాయి. అంటే జిల్లాలో 100పైగా పాఠశాలల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రత్యేకించి గుంటూరు నగరంలో 8నుంచి 10పాఠశాలల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.
మౌలిక వసతులు, అధ్యాపకుల నియామకమే కీలకం ఒక్కో మండలంలో సగటున రెండు పాఠశాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటుకానున్న నేపథ్యంలో అక్కడ మౌలిక వసతులు, అధ్యాపకుల నియామకం కీలకం కానుంది
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన ప్రాంగణాలు, ఆటస్థలాలు ఉంటాయి. దీంతో అక్కడ భవనాలు పూర్తిస్థాయిలో నిర్మించి మౌలిక వసతులు కల్పించి, నిష్ణాతులైన అధ్యాపకుల్ని నియమిస్తేచాలు అనే భావనతో ప్రభుత్వం ఉంది. అంతేకాదు ఇంటర్ మెరుగైన ఫలితాలు సాధించి కార్పొరేట్, ప్రభుత్వ గురుకుల జూనియర్ కళాశాలలకు దీటుగా విద్యార్థులకు బోధన అందించాలని యోచిస్తున్నారు. ఒకటి రెండు సంవత్సరాల్లో ఇటువంటి ఫలితాలు సాధించగలిగితే ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడుతుందని, ఇందుకు పటిష్టమైన కార్యచరణ సిద్ధంచేయాలని ఇంటర్ స్థాయిలో అధికారులు యోచిస్తున్నారు.
ఇదే జరిగితే కార్పొరేట్ కళాశాలల్లో వేలకు వేలు చెల్లించి పేద విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంటర్ రెండు సంవత్సరాలు పూర్తిచేయాంటే కార్పొరేట్ కళాశాలల్లో ఒక్కొ విద్యార్థి రూ. 40 వేల నుంచి రూ. 1 లక్షవరకు (హాస్టల్, ఐఐటీ, జేఈఈ శిక్షణతో కలిపి) చెల్లించుకోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇందుకు సాధ్యాసాధ్యాలపై రాష్ట్రస్థాయిలో పరిశీన జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే సర్కారు స్కూల్స్‌కు మహర్దశ పట్టనుంది
0 Response to "ఏపీలో జూనియర్ కళాశాలలుగా మారనున్న స్కూళ్లు."
Post a Comment