అమ్మ ఒడి

సన్నగిల్లినట్లే!

అమరావతి, ఆంధ్రప్రభ రాష్ట్రప్రభుత్వం నూతనంగా
ప్రవేశపెట్టబోతున్న అమ్మ ఒడి పథకం పట్ల లబ్ధిదారులు
ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది తూ. 15 కలు వారి
ఖాతాలో జమ అవుతాయని ఆశతో ఉన్నారు. దీనివల్ల
తమ చిన్నారులు కార్పొరేట్‌ పాఠశాలల్లో ధీమా
గా చదువుకోగలుగుతారని ఆశాభావంతో
ఉన్నారు. కానీ అమ్మ ఒడి పథకం తమకు

వర్తిస్తుందో లేదోనని కొందరు మాత్రం ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. అమ్మ ఒడిలో వారి పేరు నమోదు అవుతుందో లేదోనని గందరగోళంలో ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొ పొందాలంటే రేషన్‌ కార్డు శ తోపాటు ఆధార్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రాత భుత్వ మార్గదర్శకాలు ఇవ్వడంతో, రేషన్‌ కార్డులు ఉన్నపారు సంతోష షం వ్యక్తం చేస్తున్నా అవిలేనివారు మాత్రం గందరగోళంలో ఉన్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ మందకొడిగా సాగింది. తెల్ల రేషన్‌ కార్డులు అర్హులుకంటే అనర్హులే అధికంగా పొందారు. అర్హత ఉన్న వారు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా వారికి రేషన్‌ కార్డులు జారీ చేయలేదు, అనర్హులకు మాత్రం వారి అనుయా యులు జారీ చేసేశారు. అక్రమార్కులు తెల్లకార్డులను బొక్కేశారు. లక్షల సంఖ్యలో బినామీలున్నారు, ఇవన్నీ అమ్మఒడిలో నమోదయితే క్షేత్రస్థాయి | లో మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు. | రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోటీశ్వ రులు, 20 ఎకరాల / వ్యవసాయ భయ ఉన్నవారికికూడా తెల్ల రేషన్‌ కార్డులున్నాయి. వీరంతా స్థానిక రెవెన్యూ అధికారులతో లాలూచీ పడి వారిని పలు రకాలుగా ప్రభావితం చేసి రేషన్‌ కార్డులు పొందారు. దాదాపు రెండు లక్షల మందికి తెల్లరేషన్‌ కార్డులున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్‌ కార్డులున్నారు. వీరందరూ అమ్మ ఒడి పథకానికి అర్హులుగా “ప్రకటిస్తారు. అయితే న్‌ "న


గత తెలుగు దేశం ప్రభుత్వంలో 2018 మా ఊరు
జన్మభూమి కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల
మందికి రేషన్‌ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది.

ఇందులో అప్పట్లోనే లక్షతెల్ల రేషన్‌ కార్డులను ప్రభు
త్వం ఇనాక్టివ్‌లో ఉంచింది. 'దీనిపై లబ్ధిదారులు ఎన్ని
సార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా సమస్యను

పరిష్కరించలేదు. కేవలం వారి పేరున రేషన్‌ కార్డు
ఇచ్చారు తప్పా వారికి కనీసం చౌకదుకణాల్లో సరుకు
లు జారీ చేయడం లేదు. రెండేళ్లయినా ఇప్పటికీ వారు

పేరు యాక్టివ్‌ కాలేదు. ఈ నేపథ్యంలో వారికి వచ్చే జ

నవరిలో రాష్ట్రప్రభుత్వం ప్రకటించినట్లుగా అమ్మ
ఒడి పథకానికి అర్హులుగా ప్రకటిస్తారా లేదా అనే
అనుమానంతో ఉన్నారు.
కుప్పలు తెప్పలుగా
రేషన్‌ కార్డుల దరఖాస్తులు

ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్‌ కార్డులు లేనివారి
సంఖ్య 4 లక్షలపైబడే ఉంది. వీరంతా అనేకసార్లు రేష
స్‌ కార్డులను దరఖాస్తు చేసుకున్నవారే. అలాగే స్పిట్‌
(ఉమ్మడి కుంటుంబం నుంచి విడిపోయి) గా ఉన్న
వారు కూడా ఉన్నారు. కొత్తగా వివాహం చేసుకుని
వేరుగా కాపురం పెట్టినవారి పేర్లను ఉమ్మడి కుటుం
బంరేషన్‌ కార్నలో నుంచి తొలగించారు. స్థానిక రేషన్‌
డీలర్ల ద్వారా ర్క ప్రక్రియ చేపట్టారు. గత రెండేళ్లుగా
ఇది ప్రహసనంగా సాగుతోంది. వీటన్నింటికీ కూడా

పౌరసరఫరాలశాఖ పరిష్కారం చూపించలేదు. కాగా
ఇప్పడు అమ్మ ఒడి పథకం (ప్రారంభానికి సిద్ధంగా
ఉండటం, డిసెంబర్‌లో కొత్తగా కార్డులు ఇస్తామని
ప్రకటించడంతో రేషన్‌ కార్డులు పోందడం "కోసం
లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ప్రభు
త్యం ప్రకటించినట్లుగా డిసెంబర్‌లో రేషన్‌ కార్డులు
ఇస్తే దరఖాస్తు చేసుకున్నవారందరికీ వస్తాయో
లేదోనని అనుమానంగానే ఉంది. ఇప్పటికే కార్పొ
రేట్‌, ప్రభుత్వ పాఠశాలలు అనే తేడా లేకుండా అన్ని
పాఠశాలల్లోనూ 1 నుంచి 12 వ తరగతి వరకు
చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రేషన్‌
కార్డులు, ఆధార్‌ కార్డులు పాఠశాలల యాజమాన్యం
తీసుకున్నారు.
వీటన్నింటినీ వచ్చే ఏడాది 2020 సంవత్సరం
కోసం ఆన్‌లైన్‌ కూడా చేశారు. గతంలో రేషన్‌ కార్డుతో
పాటు, ఆధార్‌ కార్డు తీసుకున్నవారి కుటుంబాలకే
అమ్మ ఒడి అందే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చే
నెలలో రేషన్‌ కార్డులు ఇచ్చినా వారు ఆన్‌ లైన్‌ చేసు
కునే అవకాశం లేదు. దీంతో రేషన్‌ కారులు పొందినా
2021 సంవత్సరం వరకూ వేచి చూడాల్సిందే. అలా
కాకుండా మొదటి సంవత్సరం కాబట్టి ఆన్‌ లైన్‌
చేయించుకునేందుకు వచ్చే నెలాఖరువుకు గడువు
ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అమ్మ ఒడి"

Post a Comment