కెన్సర్‌కు ఉచిత వైద్యం
డిసెంబరు 21 నుంచి ఆరోగ్య కార్టులు: సీఎం
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి).. రాష్ట్రంలో ఇన్ వ్యాధిగ్ర
స్తులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించాలని సీఎం జగన్
ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం
ఆయన 'నాడు-నేడుపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వ
హించారు. డిసెంబరు 1నుంచి ఆరోగ్య కార్డులు జారీ చేయాలని
సూచించారు. ప్రతి ఆస్పత్రిలోనూ మందుల కొరత లేకుండా చూడా
లని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నాణ్యతా
ప్రమాణాలు ఉండాలని, ప్రభుత్వాస్పత్రుల్లో కూడా ప్రమాణాలు
బాగా పెరగాలని సూచించారు. 80 ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు
ఐపీహెచ్‌ఎస్ ప్రమాణాల ప్రకారం అలిషిద్ధి చేయాలని, దీనికి
సంబంధించి జ్యుడీషియల్ ప్రవ్యూకు వెంటనే పంపి టెండర్లు ఖరారు
చేయాలన్నారు. తొలిదశలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా
ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పనులు చేస్తున్నామని, నాడు-నేడు
కార్యక్రమం డిసెంబరు ౧6 నుంచి ప్రారంభిస్తామని అధికారులు తెలి
పారు. రాష్ట్రంలో $510రకాలకు పైగా మందులున్నాయని, డిసెంబరు
15నుంచి వీటిని ఆస్పత్రుల్లో అందుబాటులో పెడుతున్నామని
చెప్పారు. తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారికి ఇచ్చే పెన్షన్లు లబ్ధి
దారుల విషయంలో గ్రామ సచివాలయాలు, వలంటీర్లను 'భాగస్వా
ములుగా చేయాలని సీఎం ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాను
కూడా గ్రామ సచివాలయాల్లో ఉంచాలన్నారు. ౧020 మే నెల నాటికి
అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీ ప్రక్రియను
పూర్తి చేయాలన్నారు. జనవరిలో పోస్టుల భర్తీకి క్యాలెండర్ విడుదల
చేయాలని ఆదేశించారు
0 Response to "కెన్సర్‌కు ఉచిత వైద్యం"
Post a Comment