రైల్వేల్లోముఖాన్ని చూసి గుర్తుపట్టే సాంకేతికత

దిల్లీ: భారతీయ రైల్వేల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌(ముఖ కవళికల ఆధారంగా గుర్తించే సాంకేతికత)ను ఉపయోగించాలని భావిస్తోంది. కృత్రిమ మేధ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా నేరస్థులను గుర్తించి అదుపులోకి తీసుకొనేందుకు ఇది బాగా ఉపయోగపడనుంది. రైల్వే భద్రతా దళం ఈ మేరకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వారి వద్ద ఉన్న సమాచారాన్ని ఎఫ్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థకు 



అనుసంధానించి క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్‌(సీసీటీఎన్‌ఎస్‌)కు అనుసంధానించనుంది. దీంతో రైల్వేస్టేషన్ల ప్రాంగణాల్లోకి వచ్చే నేరగాళ్లను గుర్తించే అవకాశం ఏర్పడుతుంది

సీసీటీఎన్‌ఎస్‌ ప్రభుత్వ ఏజెన్సీల వద్ద ఉండే నేరగాళ్ల సమాచారం. మేము దీనిని ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ సాయంతో మా ఎఫ్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థకు అనుసంధానించాలనుకుంటున్నాం. దీంతో నేరగాళ్లకు చెందిన సమాచారం మా వద్దకు వస్తుంది. ఎఫ్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థ ముఖ కవళికల ఆధారంగా రైల్వేస్టేషన్లలోకి వచ్చిన నేరగాళ్లను గుర్తిస్తుంది. దీనిని అన్ని పెద్ద రైల్వేస్టేషన్లలో అమరిస్తే భద్రత విషయంలో బలమైన మార్పులు చోటు చేసుకొంటాయి. నేరాలు జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవచ్చు. భారతీయ రైల్వేల్లో నిత్యం కొన్ని కోట్లమంది ప్రయాణిస్తుంటారు. నేరాలు జరగడానికి అత్యధికంగా అవకాశం ఉన్న ప్రదేశాలుగా రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమల్లోకి తెస్తే వేలమందిలో కూడా ఒక నేరగాడిని గుర్తించవచ్చు. బెంగళూరు రైల్వే భద్రతా దళం దీనిని క్షుణ్ణంగా పరిశీలించింది. దాదాపు 2,00,000 మంది ప్రయాణికులను పరీక్షించి నేర చరిత్ర ఉన్న 32మందిని గుర్తించింది. అనుమానితులు ముసుగు వేసుకొన్నా, నల్ల కళ్లద్దాలు పెట్టుకొన్నా గుర్తించింది'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక రైల్వే అధికారి పేర్కొన్నారు. 
బెంగళూరు తర్వాత యశ్వంత్‌పూర్‌ వంటి సమీప స్టేషన్లలో దీనిని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. అనంతరం దిల్లీ, ముంబయి మెట్రోస్టేషన్లలో, ముంబయి, కోల్‌కతా, చెన్నై సబ్‌అర్బన్‌ రైల్‌ నెట్‌వర్క్‌ల్లో వీటిని ఏర్పాటు చేయవచ్చు. నేరగాళ్లకు సంబంధించిన పదేళ్ల నాటి చిత్రాల ఆధారంగా కూడా ఇవి గుర్తిస్తాయి. ఆర్‌పీఎఫ్‌ డీజీ కుమార్‌ మాట్లాడుతూ ''ఇప్పటికే 200 రైల్వే స్టేషన్లలో భద్రత మెరుగుపర్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బెంగళూరులో స్టేషన్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు మొదలు పెట్టాము. నెమ్మదిగా దీనిని దేశం మొత్తం విస్తరిస్తాము'' అని అన్నారు.

జులైలో ఇటువంటి సాంకేతికతను బెంగళూరు ఎయిర్‌పోర్టులో వినియోగంలోకి తెచ్చారు. హైదరాబాద్‌ విమానాశ్రయంలో దీనిని పరీక్షించారు. ఈ టెక్నాలజీ బోర్డింగ్‌ పాస్‌లు, ఇతర సాంకేతికతల ఆధారంగా ప్రయాణికులను గుర్తిస్తాయి. మరోపక్క ఇవి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ''ఇప్పటికైతే ఇవి పూర్తిగా చట్టవిరుద్ధం. ఇప్పటికే భారత్‌లో అమలు చేస్తున్న దీనికి ఎటువంటి చట్టాలు, నిబంధనలు లేవు. వ్యక్తిగత గోప్యత కాపాడుకొనే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించిన చట్టాలు చేయాల్సి ఉంది. చివరకు వీటిని పరీక్షించిన విమానాశ్రయాలకు సంబంధించి కూడా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఎటువంటి చట్టపరమైన ఏర్పాట్లు లేవు'' అని ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ అపర్‌ గుప్తా 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రైల్వేల్లోముఖాన్ని చూసి గుర్తుపట్టే సాంకేతికత"

Post a Comment