దిల్లీలో అమ్మకానికి ఆక్సిజన్
15నిమిషాల స్వచ్ఛమైన గాలి ధర రూ.299
న్యూ దిల్లీ: దిల్లీలో నానాటికీ వాయుకాలుష్యం పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ అవి ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వటంలేదు. స్వచ్చమైన గాలి కోసం ప్రజలకు ఎదురుచూపులు తప్పటంలేదు. దీన్ని అదనుగా భావించిన దిల్లీ సాకేత్ ప్రాంతంలోని 'ఆక్సిప్యూర్' అనే బార్ స్వచ్చమైన గాలిని అమ్మకానికి ఉంచింది. పదిహేను నిమిషాల ఆక్సిజన్‌ను రూ. 299లకు అమ్ముతున్నట్లు బార్ నిర్వాహకులు తెలిపారు. లెమన్‌గ్రాస్, ఆరెంజ్, సిన్నామన్ (దాల్చినచెక్క), స్పియర్‌మింట్ (పుదీనా), పెప్పర్‌మింట్, యూకలిప్టస్, లావెండర్, వెనీలా, చెర్రీ, బాదం, వింటర్‌గ్రీన్, గార్డెనియాస్ వంటి ఏడు రకాల పరిమళాలలో ఆక్సిజన్‌ను
మేము వివిధ రకాల పరిమళాలలో పదిహేను నిమిషాల పాటు పీడనాన్ని అదుపుచేస్తూ గాలిని అందిస్తాము. వినియోగదారులు ట్యూబ్ ద్వారా ఈ గాలిని పీల్చుకోవచ్చు. దీన్ని ఒక వ్యక్తి రోజులో ఒకసారి మాత్రమే పీల్చుకోగలరు. దీని వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని'' ఆక్సిప్యూర్ ప్రతినిధి బోన్ని ఐరెన్‌బామ్ తెలిపారు. దీనిని రోజులో ఒక సారి పీల్చడం వల్ల శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచి నిద్ర పడుతుంది, ఒత్తిడిని దరిచేరనీయదు, జీర్ణశక్తి పెరుగుతుందని బోన్ని ఐరెన్‌బామ్
0 Response to "దిల్లీలో అమ్మకానికి ఆక్సిజన్"
Post a Comment