తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు త్వరలో వేతనసవరణ
తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు త్వరలో వేతనసవరణ జరుగనుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత 2015 ఫిబ్రవరి 5న తొలిసారిగా 43 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రభుత్వోద్యోగులకు పిఆర్సీ లభించింది. తెలంగాణ ప్రభుత్వోద్యోగుల పిఆర్‌సీ గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది. కనుక వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సిఎం కేసీఆర్ వేతనసవరణ సంఘాన్ని(పిఆర్‌సీ) ఆదేశించారు. పిఆర్‌సీ నివేదికతో ఉద్యోగుల జీతాలు పెంచడం వలన ప్రభుత్వంపై ఎంత అధనపు భారం పడుతుందనేదానిపై స్పష్టత వస్తుంది. అప్పుడు దాని ఆధారంగా మంత్రులు లేదా ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. నిజానికి దీనికోసం ప్రభుత్వం గత ఏడాది మేనెలలోనే ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ వారు ఇంతవరకు నివేదిక ఇవ్వకపోవడంతో, పిఆర్‌సీ నివేదిక ఆధారంగా త్వరలోనే మరో కమిటీని నియమించనుంది
కమిటీ సభ్యులు ఉద్యోగ, పెన్షనర్ సంఘాలతో చర్చించిన తరువాత వేతనసవరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొంటుంది. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. మరోపక్క ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వోద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. కనుక వారు ఆర్టీసీ కార్మికులతో చేతులు కలపకుండా నివారించేందుకు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వోద్యోగులకు వేతనసవరణ ప్రక్రియను ప్రారంభించి ఉండవచ్చు. ప్రభుత్వం ఏ కారణంతో ఈ నిర్ణయం తీసుకొన్నప్పటికీ, అది రాష్ట్రంలో 3.5 లక్షల మంది ప్రభుత్వోద్యోగులకు, 2 లక్షల మంది పింఛనుదారులకు చాలా లబ్ది కలిగిస్తుంది
Additional information
తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పిఆర్‌సి ప్రకటన చేయనుంది. 10 నుంచి 12 రోజుల్లో వేతన సవరణ కమిటీ (పిఆర్‌సి) తన నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. దీంతో పిఆర్‌సి కమిటీ ఇప్పటికే తయారు చేసుకున్న నివేదిక కు తుది మెరుగులు దిద్దుతోంది. ఉద్యోగు లు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు డిసెంబర్ లేదా కొత్త ఏడాది నుంచి కొత్త వేతనాలు ఇచ్చేలా దీనికి తుది రూపం ఇస్తున్నారు. ఉద్యోగులకు 27 శాతం నుంచి 35 శాతం మధ్య ఫిట్‌మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. నివేదిక కూడా ఈ మేరకే వెలువడే అవకాశాలున్నాయి. శాఖలు, కేడర్ వారీగా కనీస, గరిష్ఠ మూల వేతనం, అలవెన్సులను పిఆర్‌సి చైర్మన్ సిఆర్ బిశ్వాల్, సభ్యులు మహ్మద్ రఫత్ అలీ, ఉమామహేశ్వరరావు నివేదికలో ప్రతిపాదిస్తున్నారు.ఉద్యోగ సంఘాలు 43 శాతం ఐఆర్, 63 శాతం ఫిట్‌మెంట్, రూ.24 వేల కనీస మూల వేతనాన్ని సిఫారసు చేయాలని కోరుతున్నాయి
తెలంగాణలోని తొలి పిఆర్‌సిలో ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 63 శాతం ఇవ్వాలని పిఆర్‌సికి టిఎన్‌జిఒ, టిజిఒ విజ్ఞప్తి చేశాయి. కానీ, డిమాండ్లకు అనుగుణంగా నివేదిక ఉండే అవకాశాల్లేవు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రభుత్వంపై భారం పడకుండా.. ప్రస్తుత వనరుల ఆధారంగానే పిఆర్‌సి నివేదికలో శ్లాబులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా వేతన స్కేళ్లు, విభాగాల వారీగా ఉద్యోగులు, వారు చేస్తున్న పని, వారికి ఇవ్వాల్సిన వేతనాలే పిఆర్‌సి నివేదికలో ఉంటాయి. ఇవన్నీ పరిశీలించాకే ఎంత మేర ఫిట్‌మెంట్ ఇవ్వాలనే అంశంపై సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇందుకు మూడు బృందాలను నియమించి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వేతనాలు, వేతన సంస్కరణలపై అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా అంతా ఆశాజనకంగా లేకపోవడంతో నివేదిక సిద్ధం చేసే పని కూడా ఆలస్యమైంది.
వాస్తవానికి కమిటీ ఆగస్టు 25వ తేదీనే కమిటీ గడువు ముగిసింది. దీనిని ప్రభుత్వం పొడిగించింది.ఒకే క్యాడర్ ఉద్యోగులకు ఒక్కో శాఖలో ఒక్కో వేతన విధానం అమలవుతున్న విషయాన్ని కమిషన్ పరిశీలించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పిఆర్‌సి కమిషన్ వివిధ శాఖలకు, ఉద్యోగులకు, శాఖాధిపతులకు ప్రశ్నావళిని పంపించింది. 1993, 1999, 2005, 2010, 2014 సంవత్సరాల్లో పిఆర్‌సి ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేసింది.
2014లో కనిష్ఠ వేతనం రూ.13000లు, గరిష్ఠవేతనం రూ.1,10,850 లుగా నిర్ణయించారు. ప్రస్తుతం అమలుచేస్తున్న మాస్టర్‌స్కేల్ విధానంపై అన్నిశాఖల ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.32 గ్రేడ్ విధానంపై శాఖాధిపతులకు ప్రశ్నావళి ఇచ్చి సమాధానాలు తెప్పించుకున్నారు. ధరలసూచీల్లో వస్తున్న మార్పులు, సాధారణ ఉద్యోగులు, గెజిటెడ్, ఎక్కువ జీతభత్యాలు అందుకునే అధికారులు వారి అవసరాలకోసం ఉపయోగించే వస్తువులు, పెరుగుతున్న ధరలు, మారుతున్న కాలంలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు తదితర అంశాలను కమిటీ అధ్యయనం చేసింది. స్పెషల్ అలవెన్సులు, ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీం, తదితర అంశాలపైన నివేదికలను సిద్ధం చేసింది

0 Response to "తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు త్వరలో వేతనసవరణ"
Post a Comment