మాతృభాషా మాధ్యమ పరిరక్షణ వేదిక
మాతృభాషా మాధ్యమ పరిరక్షణ వేదిక - AP 10-11-2019 Vijayawada
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన 81/05-11-2019 ఉత్తర్వులను ఉపనసంహరించుకోవాలని కోరుతూ 10 నవంబర్ 2019 ఆదివారం ఉదయం విజయవాడ కార్యాలయంలో ప్రజాసాహితి మాసపత్రిక ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలు తీర్మానాలు : 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేస్తూ విడుదల చేసిన 81/05-1 1-2019 ఉత్తర్ములను తక్షణమే ఉపసంహరించుకోవాలి. 2. నూతన జాతీయ విద్యావిధానం-2019 ప్రకారం ప్రాథమిక పాఠశాల విద్య 1 నుండి 8 తరగతులలో అన్ని పాఠశాలలలో మాత్యభాషా మాధ్యమంలోనే విద్యాబోధనను సాగించాలి. 3. కొఠారి కమీషన్ సూచనల మేరకు కామన్ స్కూల్ విధానాన్ని అమలు పరచటం ద్వారా ధనిక, పేద తారతమ్మాలు లేకుండా అందరికీ సమానావకాశాలు కల్చించాలి. 4. పరిపాలనా భాషగా తెలుగును అమలు పరచాలని ప్రభుత్వాన్ని ఈ సమావేశం కోరుతుంది. 5. ప్రభుత్వ ఉద్యోగాలలో తెలుగు మాధ్యమంలో చదివిన వారికి ఇరవై శాతం రిజర్వేషన్ కల్చించాలి. 6. 17 నవంబర్ 2019 ఆదివారం ఉదయం పదిగంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల తెలుగు తల్లి విగ్రహం సమక్షంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సాహితీ, సాంస్కృతిక, ప్రజాసంఘాలు, భాషాభిమానులు, యువజన విద్యార్ధి సంఘాలకు సమావేశం విజ్ఞప్తి చేసింది ఈ తీర్మానాలు అమలు కొరకు కార్యాచరణను రూపొందించటానికి సమావేశం 'మాత్యభాషా మాధ్యమ పరిరక్షణ వేదిక' పేరిట తాత్కాలిక కమిటీని ఎన్నుకొంది. ఈ వేదిక కన్వీనర్‌గా తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు సామల రమేష్‌బాబు, కో-కన్వీనర్లు గా కొత్తపల్లి రవిబాబు, అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణలను సమావేశం ఎన్నుకొంది
0 Response to "మాతృభాషా మాధ్యమ పరిరక్షణ వేదిక"
Post a Comment