ఉద్యోగార్థుల ఆశల పై
రుణాత్మక దెబ్బ
17.5 నుంచి 25 మార్కుల కోత
9 అదనపు మార్కుల కేటాయింపుతో ఊరట
ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షలు
రాసిన అభ్యర్థుల ఆశలను రుణాత్మక (నెగెటివ్) మార్కులు తీవ్రంగా దెబ్బ
తీశాయి. ఈ కారణంగా ఒక్కో అభ్యర్థి సరాసరి 11.5 నుంచి 25 మార్కులు
కోల్పోయినట్లు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు పంచాయ
తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. పరీక్షల తొలి
రోజున ప్రశ్నలు కఠినంగా ఉండటంతో ఎక్కువ మంది తోచిన సమాధానా
లిచ్చారు. ఫలితంగా రుణాత్మక మార్కులు దెబ్బ పడింది. పరీక్ష రాసిన ప్రతి
అభ్యర్థికీ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ అనుమతితో 15
మార్కుల చొప్పున అదనంగా కేటాయించినట్లు అధికారులు వివరించారు.
ఈ నిర్ణయంతో వివిధ కేటగిరీల్లో మిగిలిన అనేక ఉద్యోగాలు భర్తీ అవుతా
యని అంచనా వేస్తున్నారు. ఒక్కో ప్రశ్నపత్రాన్ని 150 మార్కులకు రూపొం
దించారు. ప్రతి 4& తప్పు జవాబులకు ఒక రుణాత్మక మార్కు ఉండటంతో
కేటగిరీ-1లోని ఉద్యోగ పరీక్షలు రాసిన వారిలో అత్యధికులు నష్టపోయారు.
ఈ నిబంధనను గమనించని చాలామంది... తుది కీ ప్రకారం చూసినా
తమకు తక్కువ మార్కులు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
మార్కుల మదింపులో లోపం జరిగిందంటూ 10 వేల మందికిపైగా పంచా
యతీరాజ్ శాఖకు మెయిల్స్ పంపారు. రుణాత్మక విధానం కారణంగానే
మార్కులు తగ్గినట్లు అధికారులు వారికి జవాబులిచ్చారు. ఇటీవల అభ్యర్థు
లకు అదనంగా కేటాయించిన 1 (గ్రేస్ మార్కులపై జిల్లాల వారీగా అర్హత
పొందిన వారి జాబితాల తయారీపై అధికారులు దృష్టి సారించారు
0 Response to "ఉద్యోగార్థుల ఆశల పై రుణాత్మక దెబ్బ"
Post a Comment