ఫాస్టాగ్‌ గడువు పెంపు

న్యూఢిల్లీ : ఫాస్టాగ్‌ విధానం గడువును మరో 15 రోజులపాటు పొడిగించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అన్ని టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ట్యాక్సును ఎలక్ట్రానిక్‌ టాక్స్‌ కలెక్షన్‌ విధానంలో ఫాస్టాగ్‌ పేరుతో డిసెంబరు 1 నుంచి వసూలు చేయాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. 


ఈ విధానంలో టోల్‌ ప్లాజాలో ఒక్క గేటులోనే నగదు చెల్లించేందుకు అవకాశముంటుంది. మిగిలినవన్నీ ఫాస్టాగ్‌ యాప్‌ ఏర్పాటుచేసుకున్న వాహనదారుల ఖాతా నుండి టోల్‌ప్లాజా ఖాతాలో సొమ్ము జమ వుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కువమంది వాహనదారులు ఫాస్టాగ్‌ను సమకూర్చుకోలేదని అధికారులు గుర్తించారు. ఈ విధానాన్ని వెంటనే అమలు చేస్తే ట్రాఫిక్‌ విపరీతంగా నిలిచిపోయే అవకాశముందని భావించి వాయిదా వేసింది
డిసెంబరు 15 నుంచి ఫాస్టాగ్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం రాష్ట్రాలకు సమాచారం పంపించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

  • ఫాస్టాగ్‌ గడువు పెంపున్యూఢిల్లీ : ఫాస్టాగ్‌ విధానం గడువును మరో 15 రోజులపాటు పొడిగించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అన్ని టోల్‌ప్లాజాల … ...
  • డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ విధానంటోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ చిప్ లు అందుబాటులో వుంచామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (నాయ్) పీడీ విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. టోల్ గేట్… ...

0 Response to "ఫాస్టాగ్‌ గడువు పెంపు"

Post a Comment