ఫీజు చెల్లించి.. నెలకు లక్షాపాతిక వేలు!

ఏడాది వ్యవధి పీజీ విద్యార్థులకుకామన్‌వెల్త్‌ మాస్టర్స్‌ స్కాలర్‌షిప్‌- 2020

ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేనివారు యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో పీజీ చేయటానికి కామన్‌వెల్త్‌ మాస్టర్స్‌ స్కాలర్‌షిప్‌లు ఆర్థికంగా తోడ్పాటునిస్తున్నాయి. ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు, థీసిస్‌ ఖర్చు, స్టడీ ట్రావెల్‌ ఖర్చు, విమాన ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందుతుంది. వీటితోపాటు నెలకు సుమారు 1.25 లక్షల స్టైపెండ్‌ కూడా ఇస్తారు.

యు నైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్‌ కమిషన్‌ (సి.ఎస్‌.సి.), భారత్‌కు చెందిన ఎంహెచ్‌ఆర్‌డీ కలసి '2020 కామన్‌వెల్త్‌ మాస్టర్‌ స్కాలర్‌షిప్‌'లను అందిస్తున్నాయి



యూకేలో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునే భారతీయ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్ఛు సెప్టెంబరు/ అక్టోబరు 2020న ప్రారంభమయ్యే ఏడాది కాల వ్యవధి ఉన్న మాస్టర్స్‌ డిగ్రీ కోర్సులు (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ డెవలప్‌మెంట్‌, స్ట్రెంథనింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అండ్‌ కెపాసిటీ, ప్రమోటింగ్‌ గ్లోబెల్‌ ప్రాస్పరిటీ, స్ట్రెంథనింగ్‌ గ్లోబెల్‌ పీస్‌, సెక్యూరిటీ అండ్‌ గవర్సెన్స్‌, స్ట్రెంథనింగ్‌ రెసిలియన్స్‌ అండ్‌ రెస్పాన్స్‌ టు క్రైసిస్‌, యాక్సెస్‌, ఇన్‌క్లూషన్‌ అండ్‌ ఆపర్చ్యునిటీ) చేసేవారికి ఈ ఉపకార వేతనాలు లభిస్తాయి. ఎంబీఏ విద్యార్థులకు ఈ అవకాశం వర్తించదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ పోర్టల్‌లోని ఈ లింక్‌లో దరఖాస్తు చేసుకోవచ్ఛు లింక్‌: http://proposal.sakshat.ac.in/scholarship/ పోర్టల్‌ నవంబరు 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్కాలర్‌షిప్‌ను పొందడానికి 39 మందిని ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఆ సమాచారాన్ని జూన్‌ 2020 నాటికి తెలియజేస్తారు.

ఎవరు అర్హులు: భారత పౌరులు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులు. భారత్‌లో శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నవారై ఉండాలి. అక్టోబరు 2020 నాటికి బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసిన లేదా పూర్తిచేయబోతున్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్ఛు అభ్యర్థులు ఈ స్కాలర్‌షిప్‌ సహాయంతోనే యూకేలో మాస్టర్స్‌ కోర్సు పూర్తిచేయాలి. ఈ ఆర్థిక సహాయం అందకపోతే యూకేలో చదివే స్థోమత తమకులేదనే విషయాన్ని తెలియజేస్తూ సంతకం చేసిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.

ఉద్యోగం చేస్తున్న విద్యార్థులైతే చదువు పూర్తయ్యేవరకు సంబంధిత సంస్థ నుంచి చదువుకోవడానికి అనుమతి, సెలవు పొంది ఉండాలి. స్కాలర్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అదనపు సమాచారం కోసం విద్యార్థులు మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ను చూస్తుండాలి. వెబ్‌సైట్‌: www.mhrd.gov.in/scholarships ఎంపికైన విద్యార్థులకు ఆ సమాచారాన్ని ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేస్తారు. అదే సమాచారాన్ని మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో కూడా పొందుపరుస్తారు.

ఎంపిక విధానం: యూకే యూనివర్సిటీలో చదువుతున్నట్టుగా పొందిన ప్రవేశపత్రాన్ని విద్యార్థులు దరఖాస్తుతోపాటు తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపికచేస్తారు.

చివరి తేది: నవంబరు 15, 2019

ముఖ్యమైన లింక్‌లు: దరఖాస్తు చేయడానికి, పూర్తి వివరాలకు కింది లింక్‌లను చూడవచ్ఛు

మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి: http://proposal.sakshat.ac.in/scholarship/

కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్‌ కమిషన్స్‌కు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సిస్టమ్‌ (ఒ.ఎ.ఎస్‌.)లో దరఖాస్తుకు: https://fs29.formsite.com/m3nCYq/iy6rpgiqua/form login.html

కామన్‌వెల్త్‌ మాస్టర్స్‌ స్కాలర్‌షిప్‌- 2020 పూర్తి వివరాలకు:http:// cscuk.dfid.gov.uk/apply/masters-

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఫీజు చెల్లించి.. నెలకు లక్షాపాతిక వేలు!"

Post a Comment