మేఘాల్లో మంచు తయారయ్యేది ఇలాగే!

బెర్లిన్‌: మేఘాల్లో మంచు పుట్టుక వెనుక గుట్టును పరిశోధకులు తొలిసారిగా ఛేదించారు. నిట్టనిలువుగా కుదిపేసే గాలులే ఆ మంచు తయారీకి కారణమవుతున్నట్లు తేల్చారు. హిమపాతం, వర్షాలకు దారితీసే పరిస్థితులను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు తాజా పరిశోధన దోహదపడే అవకాశముంది. సాధారణంగా కొన్ని మేఘాల్లో నీటి ఆవిరితోపాటు మంచు కణాలు, చల్లని ద్రవరూప సూక్ష్మబిందువులు, వేడి-చల్లని గాలి కలిసి ఉంటాయి. వాటిని మిశ్రమ దశ మేఘాలుగా పిలుస్తారు. చల్లని గాలితో పోలిస్తే వేడి గాలి సాంద్రత తక్కువ. కాబట్టి వేడి గాలి పైకి వెళ్లే క్రమంలో మిశ్రమ దశ మేఘాలు నిట్టనిలువుగా కుదుపులకు లోనవుతాయి. ఈ ప్రక్రియలోనే మంచు కణాలు కలిసిపోయి మంచు తయారవుతున్నట్లు లేజర్‌, రాడార్‌ సాంకేతికతల సాయంతో తాము చేసిన పరిశోధనల్లో తేలిందని జర్మనీలోని 'లీబ్నిజ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ట్రోపోఫెరిక్‌ రీసెర్చి' పరిశోధకులు తెలిపారు


నిట్టనిలువు గాలులు ఎంత ఎక్కువగా కుదిపేస్తే.. అంత అధికంగా మేఘాల్లో మంచు తయారై కిందకు కురుస్తుందని వివరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మేఘాల్లో మంచు తయారయ్యేది ఇలాగే!"

Post a Comment