టీచర్లకు బోధనేతర పనుల తగ్గింపు

టీచర్లకు బోధనేతర
పనుల తగ్గింపు!

దిల్లీ: అధ్యాపకులు బోధనేతర విధులను
నిర్వర్తించరాదంటూ నూతన జాతీయ విద్యా
విధానం(ఎన్‌ఈపీ) ముసాయిదా సూచించింది.
బోధన అనేది అత్యంత ప్రత్యేకమైన విధి అని
పేర్కొంది. ఎన్నికల సమయంలో కేవలం
పోలింగ్‌ సంబంధిత ప్రక్రియను మాత్రమే


అధ్యాపకులకు అప్పగించాలని స్పష్టం చేసింది. మధ్యాహ్నభోజన తయారీ వంటి బోధనేతర విధులు నిర్వర్తించరాదని సిఫారసు చేసింది. ఇలాంటి విధుల వల్ల బోధన దిశగా వారు పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేరంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "టీచర్లకు బోధనేతర పనుల తగ్గింపు"