వాషింగ్టన్: అమెరికా-భారత్ మధ్య మెరుగైన
సంబంధాలు కొనసాగుతున్నాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. శ్వేతసౌధంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన భారత్‌తో వాణిజ్య ఒప్పందం పురోగతిపై అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా స్పందించారు. ''భారత్-అమెరికా మధ్య అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ నాకు గొప్ప మిత్రుడు. నేను హ్యూస్టన్‌లో ఆయనతో కలిసి వేదికను పంచుకున్న విషయం తెలిసిందే'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 'ఏదో ఓ సమయంలో భారత్‌కు వెళతానం'టూ భారత పర్యటనపై తన అభిప్రాయాన్ని వెల్లడించడం విశేషం.
హ్యూస్టన్‌లో 'హౌడీ-మోదీ' సభ సందర్భంగా ట్రంప్‌ని కుటుంబసమేతంగా భారత పర్యటనకు మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ట్రంప్ పర్యటన ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు.
గత జూన్‌లో భారత్‌ను ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ) జాబితా నుంచి అమెరికా తొలగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు చెందిన ఉత్పత్తులపై అగ్రరాజ్యం అధిక సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు తెలెత్తాయి. దీనిపై ఉభయ దేశాల వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో వీటి పరిష్కారం దిశగా రెండు దేశాల ప్రతినిధులు, మంత్రులు విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే దీనిపై ఓ ఒప్పందం కుదరొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా తెలిపారు.
0 Response to "భారత్‌కు వెళతా..!: ట్రంప్"
Post a Comment