నిరుద్యోగుల కోసం కేంద్రం జాబ్ పోర్టల్

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక కొత్త పోర్టల్ ను ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్ ద్వారా ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులు తమ అర్హతకు తగిన ఉద్యోగాన్ని సంపాయించుకోవచ్చు. నేషనల్ సర్వీస్ పోర్టల్ పేరుతో కేంద్రం ఈ పోర్టల్ ను రెడీ చేసింది.



 గ్రాడ్యూయేట్స్, పోస్ట్ గ్రాడ్యూయేట్స్, ఇంజనీరింగ్ చేసిన విద్యార్ధుల వారీగా అన్ని విభాగాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు ఉన్నాయి. నగరాల్లో ఉండే అనేక ప్రైవేట్, కార్పోరేట్ కంపెనీల వివరాలు.. వాటిలో ఉండే ఉద్యోగ సమాచారంకి సంబంధించిన వివరాలు, అర్హతలు అన్ని ఈ పోర్టల్‌లో లభ్యమవుతాయి. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ముందుగా https://www.ncs.gov.in/ వెబ్‍సైట్‍లో లాగిన్‍ అయ్యి అభ్యర్థి పేరును నమోదు చేసుకోవాలి. దీనికి సంబందించిన పూర్తి వివరాల కోసం 18004251514 టోల్‍ఫ్రీ నంబర్‍ కూడా అందుబాటులో ఉంది

ఇది ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు ఇది పనిచేస్తోంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నిరుద్యోగుల కోసం కేంద్రం జాబ్ పోర్టల్"

Post a Comment