సామాన్యులకు గుడ్ న్యూస్...గ్యాస్ సిలిండర్ ధర పెంపు వారికి మాత్రమే...?
గృహ అవసరాల కోసం నిత్యం వినియోగించే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ రేటు ఏకంగా 76 రూపాయలు పెరిగి 733 రూపాయలకు చేరిన విషయం తెలిసిందే. ప్రతి నెల మొదటి తేదీన ఎల్పీజీ ధరలను రిటైల్ సంస్థలు సవరిస్తూ ఉండటంతో కొత్త రేట్లు నిన్నటినుండి అమలులోకి వచ్చాయి, అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర పెరగటంతో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి.
ఇంధన సంస్థలు డాలర్ పై రూపాయి మారకం విలువ తగ్గటం వలన ఇన్ పుట్ కాస్ట్ పెరగటంతో ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పటికీ సామాన్యులు వినియోగించే సబ్సీడీ సిలిండర్ వినియోగదారులపై ఒక్క పైసా కూడా భారం పడదు. పెరిగిన ధరకు తగిన విధంగా బ్యాంకు ఖాతాలలో సబ్సిడీ జమ కూడా పెరుగుతుంది
గృహ వినియోగదారులు డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకుంటే సబ్సిడీ వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందన్న విషయం విదితమే. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగటంతో ప్రస్తుతం 5 కిలోల చిన్న సిలిండర్ల రేటు 264 రూపాయలుగా ఉండగా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా 119 రూపాయలు పెరిగింది. ప్రభుత్వం ఒక కుటుంబానికి సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తుంది.
ఈ సబ్సిడీ సిలిండర్ల తరువాత అదనపు సిలిండర్ కావాలంటే మాత్రమే సామాన్యులు మార్కెట్ రేటుకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదనపు సిలిండర్ కు సబ్సిడీ జమ కాదు. కానీ సామాన్యులకు సాధారణంగా సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు సరిపోతాయి. అరుదుగా మాత్రమే సామాన్యులకు అదనపు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సిన అవసరం
0 Response to "సామాన్యులకు గుడ్ న్యూస్...గ్యాస్ సిలిండర్ ధర పెంపు వారికి మాత్రమే...?"
Post a Comment