ప్రైవేటుకు దీటుగా....ఆధునిక పద్ధతుల్లో విద్యభోధన


విద్యార్థులే స్వయంగా ప్రైవేటు పాఠశాలలను విడిచిపెట్టి ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు.



ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మార్పులు విద్యార్థుల భవితవ్యానికి గట్టి పునాది వేస్తున్నాయి. నాణ్యమైన విద్యకు సర్కారు బడే చిరునామా అనేలా బోధన ప్రక్రియను కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాధ్యాయులు చొరవ తీసుకుని ఆకట్టుకునేలా బోధనను సాగిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది

దోమ మండల పరిధిలోని 36 గ్రామ పంచాయితీల్లో 52 ప్రాథమిక పాఠశాలలు 8 ప్రాథమికోన్నత, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులంతా విద్యార్థులను అనుక్షణం పరీక్షిస్తూ వారికి అర్థమయ్యేరీతిలో బోధిస్తున్నారు. నాలుగు సంవత్సరాల నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండడంతో విద్యార్థుల సంఖ్య పెరగడం మొదలైంది. ప్రస్తుతం మండలంలోని ఆయా పాఠశాలల్లో మొత్తం 6,800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు తమంతట తామే స్వస్తిపలికేలా ప్రణాళికలను రూపొందించి వాటిని అమలు చేస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 
బోధనోపకరణాల సాయంతో.. 
విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో బోధనోపకరణాలను ఉపయోగించి ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. ఉపాధ్యాయులు తమ సొంత డబ్బు వెచ్చించి ప్రతి తరగతి గదికి బోధనోపకరణాలను సమకూరుస్తున్నారు. పాఠ్యాంశాలను బోధనోపకరణాలను జోడించి చెబుతున్న కారణంగా విద్యార్థులు ఏ అంశాన్ని మరిచిపోయే అవకాశమే లేదని చెబుతున్నారు. పాఠ్యాంశానికి సంబంధించిన బోధనోపకరణాలను తయారు చేసుకుని వాటిని చూపుతూ బోధిస్తుండడంతో చక్కని అవగాహన వస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, పలు అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంద్వారా సమాజ జ్ఞానాన్ని కూడా అందిస్తున్నారు. పాఠ్యాంశానికి సంబంధించినవి మాత్రమే కాకుండా కాకుండా పద్యాలు, నీతి కథలు, సంప్రదాయ పద్ధతులను నేర్పించడంద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. 
నవోదయకు ప్రత్యేక బోధన : 
నవోదయ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకోసం ప్రతి ఏడాది ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పాఠశాల సమయం ముగియగానే ఐదో తరగతి చదివే విద్యార్థులకు నవోదయకు సంబంధించి ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు. దీంతో ప్రతి ఏడాది మండలవ్యాప్తంగా పదుల సంఖ్యలో నవోదయకు విద్యార్థులు ఎంపికవుతున్నారు. 

అర్థమయ్యే రీతిలో బోధన : 
ప్రభుత్వ పాఠశాల అనడమే కాని ఇక్కడ చదువులన్ని ్ర్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డపైవేటు పాఠశాలలకు దీటుగా కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులందరం ఏకమై విద్యార్థులకు నూతన పద్ధతులపై విద్యనందించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థికి అర్థ్ధమయ్యేరీతిలో బోధన కొనసాగుతోంది. 
- హరిశ్చందర్‌నాయక్, మండల విద్యాధికారి 

గ్రామస్తుల సహకారం ఉంది 
ప్రతి విద్యార్థిని దృష్టిలో ఉంచుకుని వారికి అర్థమయ్యేరీతిలో విద్యాబోధన జరుపుతున్నాం. అన్నిస్థాయిల విద్యార్థులకు పాఠాలు అర్థమవుతున్నాయి. గ్రామస్తుల సహకారం పూర్తిగా అందుతోంది. 
- శ్రీశైలం, ఉపాధ్యాయుడు మల్లేపల్లి ప్రాథమిక పాఠశాల

నో కాస్ట్.. లో కాస్ట్ పద్ధతిలో.. 
విద్యార్థులకు బోధనోపకరణాలను నో కాస్ట్-లో కాస్ట్ పద్ధతిలో అందిస్తూ విద్యాబోధన కొనసాగిస్తాం. ప్రతి విద్యార్థిని దృష్టిలో ఉంచుకుని విద్యను బోధించడం జరుగుతుంది. ఒక పాఠ్యాంశం ప్రతి విద్యార్థికి సంపూర్ణంగా అర్థమయ్యేవరకు బోధన కొనసాగిస్తాం. 
- రాములు, ప్రధానోపాధ్యాయుడు, మల్లేపల్లి ప్రాథమిక పాఠశాల

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ప్రైవేటుకు దీటుగా....ఆధునిక పద్ధతుల్లో విద్యభోధన"

Post a Comment