అంతా ఆంగ్లమే.



  • ఇప్పటికే 34% స్కూళ్లలో
  • ఇక మిగతా 66% బడుల్లో వచ్చే ఏడాదే అమలులోకి
  • రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం

అమరావతి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 34శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమల్లో ఉన్నదని, మిగిలిన 66శాతం పాఠశాలల్లోనూ ఇకపై అమలు చేయాలని తీర్మానించింది. ఈ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. ''పోటీ ప్రపంచంలో ఏదో ఒక స్థాయిలో ఆంగ్ల భాషను అంతా నేర్చుకుంటున్నారు


కొందరు 8వ తరగతి, కొందరు ఇంటర్‌, కొందరు డిగ్రీ, మరికొందరు పీజీ...ఇలా ఏదో ఒక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలోకి వెళ్తున్నారు. అయితే సంగ్రహణ సామర్థ్యం బాల్యం నుంచే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒకటో తరగతి నుంచి పెడితే పేదల పిల్లలు కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది'' అని మంత్రి వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. పిల్లలు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాతృభాష తెలుగు, లేక ఉర్దూ కచ్చితంగా చదివాల్సి ఉంటుందని, మిగతా సబ్జెక్టులు మాత్రం ఆంగ్ల భాషలో బోధిస్తారని 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "అంతా ఆంగ్లమే."

Post a Comment